Telangana: భద్రాద్రి కొత్తగూడెంలో నవవధువు కిడ్నాప్..

Published : Aug 10, 2023, 07:41 PM IST
Telangana: భద్రాద్రి కొత్తగూడెంలో నవవధువు కిడ్నాప్..

సారాంశం

Bhadradri Kothagudem: రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నవ వధువు కిడ్నాప్ క‌ల‌క‌లం రేపుతోంది. న‌వ‌వధువులు ఆటోలో వెళ్తుండ‌గా అడ్డ‌గించిన దుండగులు.. నవీన్ ను చితకబాది మాధవిని కారులో తీసుకెళ్లారు. ఇటీవ‌లే వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు.  

Newly-married woman kidnapped: రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెంలో నవ వధువు కిడ్నాప్ క‌ల‌క‌లం రేపుతోంది. న‌వ‌వధువులు ఆటోలో వెళ్తుండ‌గా అడ్డ‌గించిన దుండగులు.. నవీన్ ను చితకబాది మాధవిని కారులో తీసుకెళ్లారు. ఇటీవ‌లే వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు.

వివ‌రాల్లోకెళ్తే.. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నవ వధువును గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. మహిళ భర్తపై దాడి చేసి తీసుకెళ్లారు. ఈ ఘటన కొత్తగూడెంలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్న నవీన్ అలియాస్ సన్నీ, మాధవి ఆటోలో వెళ్తుండగా కొందరు వ్యక్తులు కారులో వ‌చ్చి వారిని అడ్డగించారు. అనంత‌రం దుండగులు నవీన్ ను చితకబాది మాధవిని కారులో తీసుకెళ్లారు.

కాగా, వీరిది కులాంతర వివాహం కావడంతో పెళ్లిని వ్యతిరేకించిన కుటుంబ సభ్యులు తన భార్యను కిడ్నాప్ చేశారని నవీన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎంబీఏ చేస్తున్న మాధవి ప్రాజెక్ట్ వర్క్ కోసం భర్తతో కలిసి కాలేజీకి వెళ్లింది. భోజనం కోసం ఆటోలో వెళ్తుండగా కిడ్నాపర్లు అడ్డుకున్నారు. ఈ క్ర‌మంలోనే వారిపై దాడి చేసి మాధ‌విని కిడ్నాప్ చేశారు. తనకు, తన భార్యకు ప్రాణహాని ఉందని నవీన్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Summer Effect: తెలంగాణ లో ఈ జిల్లాలకు అలెర్ట్ రానున్న మూడు రోజుల్లో తీవ్ర వేడి | Asianet News Telugu
Job Mela 2026 : తెలుగు యువతకు సూపర్ ఛాన్స్.. మే 2026 లో భారీ ఉద్యోగాల భర్తీ.. ఏరోజు, ఏ జిల్లాలో, ఎన్ని జాబ్స్..?