వితంతువుతో అక్రమ సంబంధం..  గర్భం దాల్చడంతో..

Published : Apr 22, 2023, 04:26 PM ISTUpdated : Apr 22, 2023, 04:27 PM IST
వితంతువుతో అక్రమ సంబంధం..  గర్భం దాల్చడంతో..

సారాంశం

పెళ్లైన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. గర్భం దాల్చడంతో ముఖం చాటేశాడు. దీంతో బాధితురాలి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.  

పెళ్లి చేసుకుంటానని ఓ వివాహితను నమ్మించాడు ఓ యువకుడు. శారీరకంగా లొంగదీసుకున్నాడు.  తమ  కోర్కెలు తీర్చుకున్నాడు. తీరా గర్భం దాల్చడంతో  ముఖం దాచేశాడు. దీంతో ఏం చేయాలో తెలియని ఆ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన వరంగల్ జిల్లాలోని చింతగట్టు ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి..65వ డివిజన్‌ చింతగట్టులోని సుభాశ్‌నగర్‌ ప్రాంతానికి ఓ యువతికి ఎనిమిదేళ్ల క్రితం హుజూరాబాద్‌కు చెందిన ఓ యువకుడితో పెండ్లి జరిగింది.

అయితే.. గతేడాది ఆ వివాహిత భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వ్యవహారంలో భార్యనే నిందితురాలుగా పేర్కొన్నారు. దీంతో ఆ మహిళ ఒంటరిగా ఉంటుంది. ఈ క్రమంలో ఆ వివాహితపై అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు కన్నేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. తన కామవాంఛ తీర్చుకున్నాడు. ఈ క్రమంలో ఆ వింతంతు గర్భం దాల్చింది. తనను పెళ్లి చేసుకోవాలని వివాహిత పట్టుబట్టడంతో యువకుడు పెళ్లికి నిరాకరించాడు. దీంతో ఆ బాధితురాలు తనకు న్యాయం చేయాలని కోరుతూ  కాకతీయ యూనివర్సిటీ పోలీసులను ఆశ్రయించింది.

ఈ మేరకు పోలీసులు సదరు యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిసింది. ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు స్పందించడం లేదనే బాధితురాలు ఆరోపణలు వ్యక్తం చేస్తుంది. పెద్దల సమక్షంలో పంచాయితీ చేసుకోవాలని సలహా ఇస్తున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.  

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?