నల్గొండ అసెంబ్లీ బరిలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి .. కుండబద్ధలు కొట్టిన భువనగిరి ఎంపీ

Siva Kodati |  
Published : Apr 22, 2023, 03:30 PM IST
నల్గొండ అసెంబ్లీ బరిలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి .. కుండబద్ధలు కొట్టిన భువనగిరి ఎంపీ

సారాంశం

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ చేస్తున్నట్లు తెలిపారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. 20 ఏళ్లుగా తాను నిజాయితీగా రాజకీయాలు చేసి, నల్గొండను అభివృద్ధి చేసినట్లు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.

టీ.కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను బరిలోకి దిగితే ప్రజలు ఖచ్చితంగా గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 28న నల్గొండ ఎంజీయూలో రేవంత్ రెడ్డి తలపెట్టిన నిరుద్యోగ దీక్ష గురించి తనకు తెలియదన్నారు. ఉత్తమ్ చెబితేనే తనకు ఆ విషయం తెలిసిందని కోమటిరెడ్డి పేర్కొన్నారు.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర నల్గొండకు చేరుకుంటుందని.. ఈ సందర్భంగా భారీ సభ ఏర్పాటు చేస్తున్నానని, ఈ కార్యక్రమానికి ప్రియాంక గాంధీ హాజరవుతారని వెంకట్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. 20 ఏళ్లుగా తాను నిజాయితీగా రాజకీయాలు చేసి, నల్గొండను అభివృద్ధి చేసినట్లు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. తాను బీజేపీలో చేరుతున్నట్లుగా వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. మోడీని పలుమార్లు కలవడంతోనే తాను బీజేపీలో చేరుతున్నట్లుగా వార్తలు వచ్చాయని వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. 

Also REad: కాంగ్రెస్‌కు రాజీనామా: కోమటిరెడ్డి ఏం చెప్పారంటే

మరోవైపు.. ఉమ్మడి నల్గొండ జిల్లా మునుగోడు కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు భగ్గుమంది. కాంగ్రెస్ పార్టీకి  చెందిన  నేతలు  పాల్వాయి స్రవంతి,  చలమల కృష్ణారెడ్డిలు  పరస్పరం విమర్శించుకుంటున్నారు.  వచ్చే  ఎన్నికల్లో  టిక్కెట్టు  అంశం కేంద్రంగా   సాగుతున్న ప్రచారం  ఈ ఇద్దరు  నేతల మధ్య  వివాదానికి  కారణమైంది. గత  ఏడాది  జరిగిన మునుగోడు  అసెంబ్లీ  ఉప ఎన్నికల్లో  పాల్వాయి  స్రవంతికి  కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు  కేటాయించింది.  కానీ  ఉప ఎన్నికల్లో  టిక్కెట్టు  కోసం  చలమల కృష్ణారెడ్డి  కూడా తీవ్రంగా ప్రయత్నించారు.  కృష్ణారెడ్డికి రేవంత్ రెడ్డి  సపోర్ట్ ఉందని  ప్రచారం  సాగింది.  కానీ,   పార్టీ సీనియర్లంతా  పాల్వాయి స్రవంతి  వైపే మొగ్గు చూపారు. 

దీంతో పాల్వాయి స్రవంతికే  కాంగ్రెస్ టిక్కెట్టు కేటాయించింది. కాంగ్రెస్ పార్టీలో  కోవర్టులు, వెధవలున్నారని  కృష్ణారెడ్డి  చేసిన  విమర్శలపై  పాల్వాయి స్రవంతి  మండిపడ్డారు. కోవర్టులు,  వెధవలు ఎవరో చెప్పాలని  పాల్వాయి స్రవంతి డిమాండ్  చేశారు. టిక్కెట్టు  కేటాయింపు  విషయంలో  సాగుతున్న ప్రచారం  కాంగ్రెస్ పార్టీ  క్యాడర్ ను గందరగోళానికి గురి  చేస్తుందని స్రవంతి  అభిప్రాయపడ్డారు.ఈ విషయమై  టీపీసీసీ చీఫ్  రేవంత్  రెడ్డికి ఫిర్యాదు  చేస్తామని కూడా  ఆమె  చెప్పారు.     

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్