తెలంగాణలో బీజేపీ గెలుపునకు కృషి చేస్తా: ఈటల రాజేందర్

By Mahesh Rajamoni  |  First Published Jul 5, 2023, 1:04 PM IST

Hyderabad: రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని బీజేపీ అగ్ర‌ నాయ‌క‌త్వంలో రాష్ట్ర శాఖ‌లో ప‌లు కీల‌క మార్పులు చేసింది. ఎంపీ బండి సంజ‌య్ కుమార్ ను త‌ప్పించి తెలంగాణ బీజేపీ చీఫ్ గా కేంద్ర మంత్రి జీ.కిష‌న్ రెడ్డి నియ‌మించింది. అలాగే, తెలంగాణలో ఎన్నికల నిర్వహణ కమిటీ అధ్యక్షుడిగా ఓబీసీ నేత ఈటల రాజేందర్‌ను ముందుకు తీసుకువ‌చ్చింది.
 


BJP MLA Eatala Rajender: తెలంగాణలో బీజేపీ గెలుపునకు కృషి చేస్తాన‌ని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ను ఓడించేది బీజేపీ మాత్రమేనని తెలిపారు. బీఆర్‌ఎస్‌ గెలిస్తే ఒక్క కుటుంబానికే లాభం, బీజేపీ గెలిస్తే ప్రజలంద‌రికీ మేలు జరుగుతుందని ఆయ‌న అన్నారు. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వంలో రాష్ట్ర శాఖ‌లో ప‌లు కీల‌క మార్పులు చేసింది. ఎంపీ బండి సంజ‌య్ కుమార్ ను త‌ప్పించి తెలంగాణ బీజేపీ చీఫ్ గా కేంద్ర మంత్రి జీ.కిష‌న్ రెడ్డి నియ‌మించింది. అలాగే, తెలంగాణలో ఎన్నికల నిర్వహణ కమిటీ అధ్యక్షుడిగా ఓబీసీ నేత ఈట‌ల‌ రాజేందర్‌ను ముందుకు తీసుకువ‌చ్చింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో సీనియర్‌ నేతగా, మంత్రిగా పనిచేసిన ఈట‌ల‌ రాజేందర్‌ను భూకబ్జా ఆరోపణలపై మంత్రివర్గం నుంచి తప్పించిన త‌ర్వాత ఆయ‌న బీజేపీలో చేరారు.

ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని కీల‌క మార్పుల నేప‌థ్యంలో తెలంగాణలో పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా నియమితులైన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాష్ట్రంలో బీజేపీ విజయానికి కృషి చేస్తానని చెప్పారు. తనపై విశ్వాసం ఉంచిన ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ శాఖ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, ఇతర నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సమస్యలు, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) బలాలు, బలహీనతలు తనకు తెలుసుననీ, తనకు అప్పగించిన పాత్రలో చిత్తశుద్ధితో పనిచేస్తానని ఈటల రాజేందర్ అన్నారు.

Latest Videos

కొత్త రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జీ.కిషన్ రెడ్డి సీనియర్ నాయకుడని, ఆయనతో కలిసి పనిచేస్తానని ఈటల రాజేందర్ చెప్పారు. గత రెండేళ్లలో బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో రెండు అసెంబ్లీ ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలు, శాసనమండలి ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని గుర్తు చేసిన ఈటల రాజేందర్, ఇటీవలి ఎన్నికల్లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ గెలుపు కోసం పోరాటం సాగిస్తామ‌ని చెప్పారు. అధికార బీఆర్ఎస్ ను ఓడించగలిగే సత్తా బీజేపీకి మాత్రమే ఉందన్నారు.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాయ‌క‌త్వంలోని బీఆర్ఎస్ గెలిస్తే ఒకే కుటుంబానికి లాభం జ‌రుగుతుంద‌ని విమ‌ర్శించిన ఈట‌ల రాజేంద‌ర్.. బీజేపీ గెలిస్తే ప్రజలంద‌రికీ మేలు జరుగుతుందన్నారు. కాగా, తెలంగాణలో పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా నియమితులైన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు ప‌లువురు ఆయ‌న నివాసంలో క‌లిసి శుభాకాంక్ష‌లు తెలిపారు.

click me!