రేవంత్ రెడ్డి ప్రమాణస్వీ కారానికి కేసీఆర్ వెడతారా?

By SumaBala Bukka  |  First Published Dec 7, 2023, 11:04 AM IST

నిన్నటి వరకు తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండుసార్లు ఎన్నికైన కెసిఆర్.. నేటి ప్రతిపక్ష నేత,  మాజీ సీఎంగా  రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతారా అనేది ఆసక్తికరంగా మారింది.


హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గురువారం మధ్యాహ్నం 1.04ని.లకు  ప్రమాణ స్వీకారానికి ముహూర్తాన్ని నిర్ణయించారు. ఎల్బీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావలసిందిగా అన్ని ప్రతిపక్ష నాయకులకు ఆహ్వానాలు అందాయి. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానాలు పంపించారు. అయితే.. నిన్నటి వరకు తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండుసార్లు ఎన్నికైన కెసిఆర్.. నేటి ప్రతిపక్ష నేత,  మాజీ సీఎంగా  రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతారా అనేది ఆసక్తికరంగా మారింది.

తెలంగాణ రాష్ట్ర నూతన సీఎం గా రేవంత్ రెడ్డి..  ఆయన నేతృత్వంలో కొత్తగా ఏర్పడుతున్న కేబినెట్ ప్రమాణ స్వీకారోత్సవానికి బీఆర్ఎస్ తరఫున ఎవరు హాజరవుతారు అనేది చర్చనీయాంశమయ్యింది. కొత్తగా ఏర్పడుతున్న ప్రభుత్వంలో తాము ప్రధాన ప్రతిపక్షంగా నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తామని ఇప్పటికే మాజీమంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించిన  సంగతి తెలిసిందే.

Latest Videos

undefined

హైదరాబాద్ కు చేరుకున్న సోనియా, రాహుల్, ప్రియాంక..

ఈ క్రమంలో కెసిఆర్  హాజరు మీద  అందరి ఆసక్తి నిలిచింది. కెసిఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. బుధవారం కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గం పర్యటనలో ఉన్నారు. వీరిద్దరూ గురువారం ఎక్కడ ఉంటారు అనే విషయం పార్టీ వర్గాలు ఇంకా వెల్లడించలేదు. రాజకీయాల్లో ప్రతిపక్షాలు అధికార పక్షాలు ఎంతగా వైరంతో ఉన్నప్పటికీ..  ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి మాజీ ముఖ్యమంత్రిగా హాజరు కావడం అనేది ప్రోటోకాల్. 

అయితే, కాంగ్రెస్ పార్టీ మీద, పీసీసీ చీప్ మీద వ్యక్తిగత ఆరోపణలు చేశారు కేసీఆర్,  కేటీఆర్ లు.. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాకపోవచ్చు అన్న సమాచారం తెలుస్తోంది.  వీరితో పాటు టిఆర్ఎస్ తరఫున ప్రజా ప్రతినిధులు ఎవరు కూడా హాజరు  కాకపోవచ్చు అనే సమాచారం. 

click me!