ఆ చీప్ చీరలు కవిత కట్టుకుంటుందా?.. కుష్బుూ

By ramya neerukondaFirst Published Dec 5, 2018, 11:03 AM IST
Highlights

 తెలంగాణ ఆడపడుచులకు ఇచ్చే బతకమ్మ చీరలపై కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్, సినీ నటి కుష్బూ కామెంట్ చేశారు. 


కేసీఆర్ ప్రభుత్వం.. తెలంగాణ ఆడపడుచులకు ఇచ్చే బతకమ్మ చీరలపై కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్, సినీ నటి కుష్బూ కామెంట్ చేశారు. చాలా చీప్ క్వాలిటీ చీరలను పంచిపెట్టారంటూ ఆమె మండిపడ్డారు. మంగళవారం ఆదిలాబాద్ లో పర్యటించిన కుష్బూ.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.  అంత చీప్ చీరను నిజామాబాద్ ఎంపీ కవిత కట్టుకుంటుందా అని ఆమె ప్రశ్నించారు.

కుష్బూ సభకు వచ్చినవారిలో ఒక మహిళను చూపిస్తూ.. ఆ మహిళ కట్టుకున్న చీర.. బతకమ్మ చీరకన్నా ఎక్కువ క్వాలిటీగా ఉందంటూ కామెంట్ చేశారు. నాలుగేళ్ల పరిపాలనలో కేసీఆర్ మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా చోటు కల్పించలేదని ఈ సందర్భంగా కుష్బూ మండిపడ్డారు.

కేసీఆర్ పేదలకు కట్టిస్టానన్న డబల్ బెడ్ రూం ఇళ్ల సంతగతి ఏమైందని ఆమె ఈ సందర్భంగా ప్రశ్నించింది. ప్రజలకు కనీసం ఇళ్లు కట్టించలేదుకానీ.. రూ.300కోట్లు ఖర్చుచేసి ప్రగతి భవన్ కట్టుకున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే.. హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పారు. 

click me!