తెలంగాణ ఎన్నికలు..రూ.111కోట్లు సీజ్

By ramya neerukondaFirst Published Dec 5, 2018, 10:46 AM IST
Highlights

ఈ ఎన్నికల సమయంలో ఇప్పటి వరకు రూ.111 కోట్లు సీజ్ చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరో రెండు రోజుల్లో జరగనుంది. ఈ లోపు ప్రజలను మభ్యపెట్టేందుకు చాలా మంది నేతలు డబ్బు పంపిణీ కార్యక్రమాలు చేపడుతున్నారు. వాటిని అడ్డుకునేందుకు ఒకవైపు పోలీసులు.. మరో వైపు ఐటీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు చేపట్టారు. ఈ ఎన్నికల సమయంలో ఇప్పటి వరకు రూ.111 కోట్లు సీజ్ చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

వీటిలో రూ.71.67కోట్లు పోలీసులు సీజ్ చేయగా.. రూ.22.50కోట్లు ఐటీ అధికారులు సీజ్ చేశారు. ఇవి కాకుండా భారీ మొత్తంలో మద్యం సీసాలను కూడా సీజ్ చేసినట్లు అధికారులు చెప్పారు. ఇప్పటి వరకు రూ.9.62కోట్ల విలువచేసే 5.80లక్షల లీటర్ల మద్యాన్ని పట్టుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా రూ.7.77కోట్లు విలువచేసే.. బంగారం, వెండి, గంజాయి, గుట్కా లాంటి వస్తువులను కూడా సీజ్ చేసినట్లు వివరించారు.

గత ఎన్నికలతో పోలిస్తే.. ఈ ఎన్నికల్లో రూ.28కోట్లు అదనంగా దాడుల్లో దొరికాయని వారు చెప్పారు. ఈ రెండు రోజులు కూడా దాడులు విస్తృతంగా చేస్తామని అధికారులు తెలిపారు. కాగా.. స్వాధీనం చేసుకున్న డబ్బుకి సరైన పత్రాలు చూపిస్తే... తిరిగి వెనక్కి ఇస్తామని చెప్పారు. 

click me!