
తెలుగునాట కొత్త రాజకీయానికి తెరలేవనుంది. పవర్ స్టార్, ప్రజాయుద్ద నౌక ఒక్కటిగా పోరుబాట బట్టే అవకాశం కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ పార్టీ జనసేనతో కలసి నడిచేందుకు గద్దర్ ఉబలాటపడుతున్నట్లు తెలుస్తోంది. పవన్ పార్టీతో జతకూడే విషయమై ఆయన పరోక్షంగా సంకేతాలిచ్చారు.
సరిగ్గా 20 ఏళ్ల కిందట ఇదే రోజు గద్దర్ పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్మరించుకుంటూనే ప్రజాసమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.
రాజకీయ పార్టీ పెట్టి భావ సారూప్యత కలిగిన శక్తులను కలుపుతామని ప్రకటించారు. మార్క్స్, పూలె సిద్ధాంతాలను అల్లేందుకు దారాన్ని అవుతానని వ్యాఖ్యానించారు. సామాజిక స్పృహతో ప్రత్యామ్నాయ పార్టీ ఏర్పడాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
ఆరు నెలల్లో రెండు లక్షల మంది గ్రామస్థాయి నేతలను కలుస్తామని తెలిపారు.
తెలంగాణలో అభివృద్ధి కింది కిందిస్థాయి నుంచి కాకుండా పై స్థాయి నుంచి జరుగుతోందని అన్నారు.మరోసారి తెలంగాణ ప్రజలు త్యాగాలకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు.
రాజకీయ పోరుతో కొత్త పంథాలో వెళుతానని స్పష్టం చేశారు. ఇన్నాళ్లు ఓటు వేయోద్దు అన్న తానే ఇప్పుడు పల్లె పల్లెకు ఓటు కోసం వస్తున్నా అని త్వరలోనే పార్టీ పెడుతానని ప్రకటించారు. మార్క్స్ ,పూలె సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీ ఉంటుందని తెలిపారు. జనసేనలాంటి భావసారూప్యతగత పార్టీతో కలసిపనిచేస్తామని పరోక్షంగా ప్రకటించారు.