తెలంగాణ పాలనను పొగిడాడని దళితుడిపై కర్నూల్ కలెక్టర్ ఫైర్

Published : Apr 06, 2017, 03:33 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
తెలంగాణ పాలనను పొగిడాడని దళితుడిపై కర్నూల్ కలెక్టర్ ఫైర్

సారాంశం

దళిత నేతలు మద్దయ్యకు మద్దతుగా నిరసన వ్యక్తం చేశారు. కలెక్టర్‌ డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు.

ఆంధ్రా కలెక్టర్ కు పట్టరాని కోపం వచ్చింది. మనసులో ఉన్నది మాట్లాడిన దళిత నేతపై కస్సుమనే స్థాయికి ఆయన ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

బుధవారం ఏపీలోని కర్నూలులో బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి ఉత్సవాలకు జిల్లా కలెక్టర్ విజయమోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్థానిక  దళిత నేత సీహెచ్‌ మద్దయ్య మాట్లాడుతూ...

 

తెలంగాణ రాష్ట్రంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కడుతుంటే మన రాష్ట్రంలో ఒక్క ఇల్లు కూడా ప్రభుత్వం కట్టడం లేదని వాపోయారు. దీంతో పక్కనే ఉన్న కలెక్టర్ ఆగ్రహంతో ఊగిపోయారు. ఆయన మాట్లాడుతుంటే మధ్యలోనే కలగజేసుకొని

 

‘‘మనకు అన్యాయం చేసిన తెలంగాణను పొగుడుతావా?  మన గడ్డ మీద పరాయి పాలన గురించి ప్రస్తావిస్తావా... ఆంధ్రా, రాయలసీమ రక్తం నాలో ఉంది. ఇక్కడుండి వేరే రాష్ట్రాల గురించి మాట్లాడొద్దు అంటూ హెచ్చరించారు. రాజకీయాలు మాట్లాడొద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో అక్కడే ఉన్న మరికొందరు దళిత నేతలు మద్దయ్యకు మద్దతుగా నిరసన వ్యక్తం చేశారు. కలెక్టర్‌ డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు.

PREV
click me!

Recommended Stories

Top 5 Churches in Hyderabad : కేవలం రూ.100 ఉంటే చాలు.. క్రిస్మస్ వేళ ఈ టాప్ చర్చిలను చుట్టిరావచ్చు
హైద‌రాబాద్‌లో కొత్త‌గా ఎలివేటెడ్ కారిడార్లు.. ఈ ప్రాంతాల్లో భూముల ధ‌ర‌లు పెర‌గ‌డం ఖాయం