ఆ నాలుగు స్థానాల్లో అభ్యర్థులను నాలుగు రోజుల్లో డిసైడ్ చేస్తాం: సీఎం కేసీఆర్

Published : Aug 21, 2023, 08:51 PM IST
ఆ నాలుగు స్థానాల్లో అభ్యర్థులను నాలుగు రోజుల్లో డిసైడ్ చేస్తాం: సీఎం కేసీఆర్

సారాంశం

సీఎం కేసీఆర్ ఈ రోజు 115 అసెంబ్లీ స్థానాలను అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. మరో నాలుగు చోట్ల మాత్రం అభ్యర్థులను ఖరారు చేయలేదు. మరో నాలుగు రోజుల్లో ఈ స్థానాల్లోనూ అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు.  

హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఈ రోజు తెలంగాణ భవన్‌లో 115 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. మరో నాలుగు చోట్ల అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ నాలుగు స్థానాలను కూడా మరో నాలుగు రోజుల్లో ఫైనల్ చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. అభ్యర్థుల జాబితా విడుదల చేస్తూ టికెట్ దక్కని వారి అసంతృప్తికి లోనుకావొద్దని సీఎం కేసీఆర్ చెప్పారు.

ఇదిలా ఉంటే  ఈ దఫా  గజ్వేల్, కామారెడ్డి అసెంబ్లీ స్థానాల నుండి కేసీఆర్ బరిలోకి దిగనున్నారు. కామారెడ్డి  అసెంబ్లీ నియోజకవర్గం  కేసీఆర్  స్వగ్రామం ఉంటుంది.  కేసీఆర్  పూర్వీకుల గ్రామం  ఇదే  నియోజకవర్గంలో ఉంటుంది.  ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా  తమ భూములు కోల్పోవడంతో  కేసీఆర్ కుటుంబం ఉమ్మడి మెదక్ జిల్లాలోని చింతమడకకు చేరుకుంది.  

Also Read: గోషామహల్ నుంచి బీజేపీ అభ్యర్థిని నేనే: బీజేపీ ‘బహిష్కృత’ ఎమ్మెల్యే రాజాసింగ్.. బీజేపీలో ముసలం ముదిరిందా?

దీంతో  తన స్వగ్రామం ఉన్న  కామారెడ్డి  నియోజకవర్గంలో  పోటీ చేయాలని  కామారెడ్డి  ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కూడ  కేసీఆర్ ను కోరారు.  కామారెడ్డి  నియోజకవర్గం నుండి టీడీపీ నుండి ఆ తర్వాత బీఆర్ఎస్ అభ్యర్ధిగా గంప గోవర్ధన్ విజయం సాధించారు.  2009లో  కామారెడ్డి  నుండి భారీ మెజారిటీతో టీడీపీ అభ్యర్థిగా  గంప గోవర్ధన్ విజయం సాధించారు. ఇదిలా ఉంటే  ఓటమి భయంతోనే కేసీఆర్ రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నారని  విపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి.

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?