బీసీల కోసం బీజేపీ మరో హామీ.. అధికారంలోకి వచ్చాక బీసీ సబ్ ప్లాన్: ఎంపీ లక్ష్మణ్

By Mahesh K  |  First Published Nov 4, 2023, 8:02 PM IST

బీసీల కోసం బీజేపీ మరో హామీ ఇచ్చింది. ఇది వరకే బీసీ సీఎం హామీ ఇచ్చిన బీజేపీ తాజాగా తెలంగాణలో అధికారంలోకి వచ్చాక బీసీ సబ్ ప్లాన్ తెస్తామని ప్రకటించింది. బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్ తాజాగా ఈ ప్రకటన చేశారు.
 


హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీసీ నినాదంతో ముందుకు వెళ్లుతున్నదని ఇది వరకే స్పష్టం అయిపోయంది. బీసీ ఓటర్లు ఎన్నికల ఫలితాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తారని తెలిసిందే. బీసీ ఓట్లను ఏ పార్టీ తేలికగా తీసుకోవు. కానీ, బీజేపీ మాత్రం వారిపైనే ప్రధాన దృష్టి పెట్టింది. ఇది వరకే బీసీ సీఎం హామీ ఇచ్చిన బీజేపీ.. తాజాగా, తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ సబ్ ప్లాన్ తీసుకువస్తామని ప్రకటించింది.

హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర హెడ్ క్వార్టర్స్‌లో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కే లక్ష్మణ్ మాట్లడారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటనను ఆయన గుర్తు చేశారు. అప్పటి నుంచి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని ఎద్దేవా చేశారు. బీసీని సీఎం చేస్తామని ప్రకటించే దమ్ము ఈ పార్టీలకు ఉన్నదా? అని సవాల్ విసిరారు.

Latest Videos

ఈ తొమ్మిదిన్నరేళ్లలో కేసీఆర్ పాలనలో బీసీలను పట్టించుకోలేదని, అన్ని విధాలుగా అణచివేశారనికే లక్ష్మణ్ ఆరోపణలు చేశారు. కాగా, బీజేపీ వచ్చేది లేదు.. బీసీ సీఎం అయ్యేదీ లేదు అన్నట్టుగా రాహుల్ గాంధీ అవహేళన చేస్తున్నారని వివరించారు.

Also Read: బండి సంజయ్‌పై బీజేపీ హైకమాండ్ ఫోకస్.. రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనకు ప్లాన్

కాగా, బీజేపీ బీసీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్న పార్టీ అని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఇది వరకు బీజేపీ ప్రకటించిన 88 మంది అభ్యర్థుల్లో 31 మంది బీసీ నేతలే అని తెలిపారు. అంతేకాదు, బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రాగానే బీసీ సబ్ ప్లాన్ తీసుకువస్తామని ప్రకటించారు.

click me!