పాతికేళ్ల కాపురం తరువాత.. భర్తనుంచి విడాకులు కోరిన భార్య.. షాక్ లో భర్త.. అసలేం జరిగిందంటే...

By SumaBala Bukka  |  First Published May 30, 2022, 8:35 AM IST

పెళ్లైన 25యేళ్ల తరువాత భర్త పెట్టే మనోవేదన తట్టుకోలోక పోతున్నానంటూ ఓ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు విడాకులు ఇప్పించాలంటూ కోరుతోంది. దీంతో భర్త షాక్ అయ్యాడు. 


హైదరాబాద్ :  పెద్దలు కుదిర్చిన  వివాహం… భార్యాభర్తలిద్దరూ అమెరికాలోని ఐటీ కంపెనీల్లో ఉన్నత హోదాల్లో ఉన్నారు. ఇటీవల భార్య తిరిగొచ్చి భర్తపై సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 25 ఏళ్ల దాంపత్య జీవితం తరువాత ఆమె భర్తపై ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. పెళ్లయిన మొదటి రోజు నుంచి భర్త ద్వారా ఎదురైన మనోవేదనను మౌనంగా భరించింది. పిల్లలు పుట్టాక  అలవాటుగా మార్చుకుంది. ఇద్దరు బిడ్డలు ఉన్నత చదువులు పూర్తి చేసి.. పెళ్లిళ్లు చేశాక.. అప్పటివరకూ అనుభవించిన నరకం నుంచి బయటపడాలనే నిర్ణయానికి వచ్చింది. 

కేసు నమోదు చేసిన పోలీసులు ఆలుమగలిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. అప్పటికి కానీ భర్తకు తాను భార్యను హింసించాను అన్న విషయం తెలుసుకోలేకపోయారు. తనపై భార్య ఫిర్యాదు చేయడానికి నమ్మలేక పోయారు. ఒక్క ఛాన్స్ ఇస్తే మారతానంటూ జీవిత భాగస్వామిని వేడుకున్నారు. ఇక ఆమె భరించలేను.. ఒంటరిగానే ఉంటానంటూతెగేసి చెప్పారు చెప్పింది. ఉన్నత హోదాలో పనిచేసే బాధితురాలు... అప్పటివరకూ ఎంతగా నలిగిపోయారు అనేది ఆమె మాటల్లోనే గుర్తించానని సైదరాబాదుకు చెందిన పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పిల్లలు ప్రయోజకులయ్యేంత వరకు వేచి చూసి చివరకు ఫిర్యాదు చేశారని వివరించారు. 

Latest Videos

undefined

ఇదిలా ఉండగా, మే 25న Madhya Pradeshలోని గ్వాలియర్లో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా భర్తలు కొట్టారని భార్యలు ఫిర్యాదు చేస్తుంటారు… కానీ ఇక్కడ సీన్ రివర్స్ లో జరిగింది. భార్య కొట్టిందని ఓ భర్త ఫిర్యాదు చేశాడు. కంట్లో Chili powder పోసి మరీ కొట్టిందని.. ఆమె నుంచి కాపాడాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. అత్తింటి వారితో వేగలేక పోతున్నానని.. దయచేసి తనకు న్యాయం చేయాలని కోరాడు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మధ్యప్రదేశ్లోని మొరెనా జిల్లా రితోరా సమీపంలోని ఓ గ్రామానికి చెందిన సంజయ్ సింగ్ కు గ్వాలియర్ లోని మహల్ గావు ప్రాంతానికి చెందిన పూజతో రెండేళ్ల క్రితం వివాహమైంది. సంజయ్ మలాన్ పూర్ లోని ఓ ఫ్యాక్టరీలో ప్లంబర్ గా పని చేసేవాడు. పెళ్లయిన కొన్నిరోజుల వరకు వీరి కాపురం సజావుగానే సాగింది. వీరిద్దరూ అన్యోన్యంగా ఉన్నారు. కానీ ఏం జరిగిందో ఏమో కానీ ఆ తర్వాత క్రమంగా విభేదాలు తలెత్తాయి. అత్తింటి వారిని పూజ అసలు గౌరవించేది కాదట.. ఇంట్లో పనులు కూడా చేసేది కాదట.. ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేదట.

ఈ క్రమంలోనే మూడు నెలల క్రితం సంజయ్ ఉద్యోగం కోల్పోయాడు.  ఆ తరువాతే గొడవలు మరింత పెరిగాయి.ఈ క్రమంలో మే 31 సంజయ్ తల్లిదండ్రులను పూజా తిట్టింది. మీ పేరెంట్స్ మంచివారు కాదు అనడంతో సంజయ్ కి కోపం వచ్చింది. భార్యను చెంపదెబ్బ కొట్టాడు. నీ వల్ల ఇంట్లో మనశ్శాంతి లేదని తిట్టాడు. ఆ తర్వాత పూజను  గ్వాలియర్ లోని తన పుట్టింట్లో దింపడానికి వెళ్ళాడు. సంజయ్ తన అత్తింటికి వెళ్ళాక గొడవ మరింత పెద్దదయింది. తన తల్లిదండ్రులు, సోదరులతో కలిసి సంజయ్ పై దాడి చేసింది పూజ. సంజయ్ ను ఇటుకలతో కొట్టడమే కాకుండా.. కంట్లో కారం చల్లారు. అందరూ కలిసి సంజయ్ ను చితకబాదారు. 

ఈ ఘటన తర్వాత అతను నేరుగా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు ఆ తర్వాత ఎస్పీ కార్యాలయానికి వెళ్లి తన గోడును వెళ్లబోసుకున్నాడు. తన భార్య కంట్లో కారం పోసి కొట్టింది అని.. ఆమె నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేశాడు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పూజతో పాటు ఆమె తల్లిదండ్రులు, సోదరులను విచారిస్తున్నారు. ఒకవేళ వారు తప్పు చేశారని తేలితే... కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఎస్పి పేర్కొన్నారు. 

click me!