దుండగుల కళ్లలో కారం చల్లి.. భర్తను కాపాడుకున్న భార్య...

Published : Jan 21, 2022, 09:47 AM IST
దుండగుల కళ్లలో కారం చల్లి.. భర్తను కాపాడుకున్న భార్య...

సారాంశం

వెంటనే భూపాల్ భార్య కళ్యాణి అప్రమత్తమైంది. వంటగదిలోకి వెళ్లి  కారం తీసుకొచ్చి దుండగులు కళ్ళలో చల్లింది. కాపాడాలంటూ పెద్దగా కేకలు వేసింది. దీంతో నిందితులు ముగ్గురూ ఆటోలో పారిపోవడానికి ప్రయత్నించారు. అంతలో అరుపులు విని భూపాల్ సోదరుడు క్రాంతికుమార్ అక్కడికి చేరుకున్నారు. కళ్లలో కారం ఎక్కువ పడడంతో నిందితుల్లో ఒకరైన రంజిత్ పారిపోలేక వారికి చిక్కాడు. 

రంగశాయి పేట :  ఆమె సాధారణ housewife తన భర్త ప్రాణాలను కాపాడుకోవడానికి అపరకాళిలా తిరగబడింది. దుండగుల కళ్లల్లో red mirchi powder చల్లి మాంగల్యాన్ని కాపాడుకుంది. ఈ ఘటన warangal పట్టణంలోని శంభునిపేటలో చోటు చేసుకుంది. స్థానికులు, సిఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం... ‘ది వరంగల్ జిల్లా లారీ అసోసియేషన్’ అధ్యక్షుడు వేముల భూపాల్ ఇంటికి బుధవారం అర్ధరాత్రి ఆటోలో నలుగురు వ్యక్తులు వచ్చారు. వీరిలో ముగ్గురు భూపాల్ ఇంట్లోకి వెళ్లి ఆయనపై knifeలతో దాడి చేసి murder చేసేందుకు ప్రయత్నించారు.

వెంటనే భూపాల్ భార్య కళ్యాణి అప్రమత్తమైంది. వంటగదిలోకి వెళ్లి  కారం తీసుకొచ్చి దుండగులు కళ్ళలో చల్లింది. కాపాడాలంటూ పెద్దగా కేకలు వేసింది. దీంతో నిందితులు ముగ్గురూ ఆటోలో పారిపోవడానికి ప్రయత్నించారు. అంతలో అరుపులు విని భూపాల్ సోదరుడు క్రాంతికుమార్ అక్కడికి చేరుకున్నారు. కళ్లలో కారం ఎక్కువ పడడంతో నిందితుల్లో ఒకరైన రంజిత్ పారిపోలేక వారికి చిక్కాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి నిందితుడిని అప్పగించారు. బాధితుల ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు. భూపాల్, క్రాంతికుమార్ సోదరులతో ఉన్న భూ తగాదాల వల్లే  ప్రత్యర్థులు హత్యకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. 

ఇదిలా ఉండగా, సంగారెడ్డి జిల్లాలోని Aminpurలో విషాదం నెలకొంది. వారిద్దరి కులాలు వేరైనా ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. వారిద్దరి అనురాగానికి గుర్తుగా  ఏడేళ్ల కుమార్తె కూడా ఉంది. ఇంతలో ఏం జరిగిందో తెలియదు. రెండు రోజులుగా కనిపించడం లేదని అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. అనుమానంతో ఇంటి తలుపులు తెరిచి చూడగా.. ఏడేళ్ల కూతురితో కలిసి తల్లి నురగలు కక్కుతూ మంచంపై విగత జీవులుగా కనిపించగా.. తండ్రి  ఉరి వేసుకుని suicide చేసుకున్నాడు. ఈ విషాద ఘటన Sangareddy District అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

అమీన్పూర్ వందనపురి కాలనీలో ఏళ్ళ చిన్నారితో సహా hole family ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. షాద్ నగర్ కు చెందిన శ్రీకాంత్, అల్వాల్ కు చెందిన అనామిక పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి స్నిగ్థ అనే ఏళ్ల కుమార్తె కూడా ఉంది. శ్రీకాంత్ గౌడ్ (42) టీసీఎస్ లో Software ఉద్యోగం చేస్తుండగా, అనామిక (40) స్థానికంగా ఉన్న ఓ కార్పొరేట్ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తోంది. ముచ్చటైన సంసారంలో ఏమైందో తెలియదు గానీ.. రెండు రోజుల నుంచి కనిపించలేదు.

అనామిక తండ్రి శ్రీరామచంద్రమూర్తి  ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో అతను వందనపూరి కాలనీలోని శ్రీకాంత్ నివాసానికి వచ్చి చూడగా తలుపు లోపల నుంచి గడియ పెట్టి ఉండటంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అక్కడికి చేరుకుని, తలుపులు తెరిచి చూడగా స్నిగ్థ,  ఆమె తల్లి anamika నోట్లో నుంచి నురగలు కారి విగతజీవులుగా మంచంపై కనిపించారు. పక్కగదిలో శ్రీకాంత్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు.

అయితే వారి నుదుటన ఎర్ర బొట్టు ఉండడం, దేవుని గదిలో చిత్రపటాలు బోర్లించి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు 

PREV
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu