అమీన్ పూర్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి కుటుంబం ఆత్మహత్య.. మొహానికి ఎర్రబొట్లు...!!

Published : Jan 21, 2022, 07:12 AM IST
అమీన్ పూర్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి కుటుంబం ఆత్మహత్య.. మొహానికి ఎర్రబొట్లు...!!

సారాంశం

అమీన్పూర్ వందనపురి కాలనీలో ఏళ్ళ చిన్నారితో సహా hole family ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. షాద్ నగర్ కు చెందిన శ్రీకాంత్, అల్వాల్ కు చెందిన అనామిక పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి స్నిగ్థ అనే ఏళ్ల కుమార్తె కూడా ఉంది. శ్రీకాంత్ గౌడ్ (42) టీసీఎస్ లో Software ఉద్యోగం చేస్తుండగా, అనామిక (40) స్థానికంగా ఉన్న ఓ కార్పొరేట్ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తోంది. 

అమీన్పూర్ : హైదరాబాద్ లోని Aminpurలో విషాదం నెలకొంది. వారిద్దరి కులాలు వేరైనా ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. వారిద్దరి అనురాగానికి గుర్తుగా  ఏడేళ్ల కుమార్తె కూడా ఉంది. ఇంతలో ఏం జరిగిందో తెలియదు. రెండు రోజులుగా కనిపించడం లేదని అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. అనుమానంతో ఇంటి తలుపులు తెరిచి చూడగా.. ఏడేళ్ల కూతురితో కలిసి తల్లి నురగలు కక్కుతూ మంచంపై విగత జీవులుగా కనిపించగా.. తండ్రి  ఉరి వేసుకుని suicide చేసుకున్నాడు. ఈ విషాద ఘటన
Sangareddy District అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

అమీన్పూర్ వందనపురి కాలనీలో ఏళ్ళ చిన్నారితో సహా hole family ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. షాద్ నగర్ కు చెందిన శ్రీకాంత్, అల్వాల్ కు చెందిన అనామిక పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి స్నిగ్థ అనే ఏళ్ల కుమార్తె కూడా ఉంది. శ్రీకాంత్ గౌడ్ (42) టీసీఎస్ లో Software ఉద్యోగం చేస్తుండగా, అనామిక (40) స్థానికంగా ఉన్న ఓ కార్పొరేట్ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తోంది. ముచ్చటైన సంసారంలో ఏమైందో తెలియదు గానీ.. రెండు రోజుల నుంచి కనిపించలేదు.

అనామిక తండ్రి శ్రీరామచంద్రమూర్తి  ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో అతను వందనపూరి కాలనీలోని శ్రీకాంత్ నివాసానికి వచ్చి చూడగా తలుపు లోపల నుంచి గడియ పెట్టి ఉండటంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అక్కడికి చేరుకుని, తలుపులు తెరిచి చూడగా స్నిగ్థ,  ఆమె తల్లి anamika నోట్లో నుంచి నురగలు కారి విగతజీవులుగా మంచంపై కనిపించారు. పక్కగదిలో శ్రీకాంత్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు.

అయితే వారి నుదుటన ఎర్ర బొట్టు ఉండడం, దేవుని గదిలో చిత్రపటాలు బోర్లించి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు 

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తనూజ మృతదేహం మిస్టరీ ఇంకా వీడలేదు. జనవరి 17న విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు పక్కన పడి ఉన్న మహిళ మృతదేహం గుంటూరుకు చెందిన Software employee తనుజ(30)దిగా పోలీసులు గుర్తించారు. ఆమె మృతిపై గుంటూరు, విజయవాడ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు ఏటి అగ్రహారానికి చెందిన తనూజ Software Engineer.  2018లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి మణికంఠతో వివాహం అయింది. వీరికి ఒక బాబు. భార్యాభర్తలిద్దరూ Bangaloreలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు. corona virus నేపథ్యంలో కొంత కాలంగా ఇంటి వద్ద నుంచే పనిచేస్తున్నారు.

ఈ క్రమంలో ఆదివారం  ఇంటి నుంచి వెళ్ళిందని..  ఆమె కోసం వెతికినా ఆచూకీ లేదంటూ తల్లిదండ్రులు సోమవారం గుంటూరులోని నగరపాలెంపోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో Vijayawadaలోని శిఖామణి సెంటర్ సమీపంలో  రోడ్డు పక్కన మహిళ మృతదేహాన్ని అక్కడి పోలీసులు గుర్తించారు. ఆమె వివరాలు తెలియకపోవడంతో Unidentified womanగా కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న గుంటూరు పోలీసులు తనూజకు సంబంధించిన ఫోటోలతో ఆ మృతదేహాన్ని పోల్చి అది ఆమె dead bodyగానే నిర్ధారణకు వచ్చారు. 

PREV
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu