పోలీస్ ఖాతాలతో డబ్బులు వసూలు: నలుగురి అరెస్ట్

By narsimha lodeFirst Published Oct 1, 2020, 10:15 AM IST
Highlights

పోలీస్ అధికారుల పేరుతో  సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి  డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను నల్గొండ పోలీసులు గురువారం నాడు అరెస్ట్ చేశారు.  నిందితుల నుండి పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు.


నల్గొండ: పోలీస్ అధికారుల పేరుతో  సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి  డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను నల్గొండ పోలీసులు గురువారం నాడు అరెస్ట్ చేశారు.  నిందితుల నుండి పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు.

నల్గొండ ఎస్పీ రంగనాథ్  పేరుతో సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్ క్రియేట్ ఆయనకు సన్నిహితులుగా ఉన్నవారి వద్ద నుండి డబ్బులు అడిగారు.ఈ విషయం ఎస్పీ దృష్టికి వచ్చింది. వెంటనే ఆయన ఎవరూ కూడ డబ్బులు పంపవద్దని కోరారు. ఈ విషయమై ఆయన స్థానికంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

మరో సీనియర్ ఐపీఎస్ అధికారి స్వాతి లక్రా పేరుతో కూడ నకిలీ అకౌంట్ క్రియేట్ డబ్బులు డిమాండ్ చేశారు. ఈ విషయం ఆమె దృష్టికి రావడంతో ఎవరూ కూడ డబ్బులు ఇవ్వవద్దని ఆమె సోషల్ మీడియా వేదికగా కోరింది.

తెలుగు రాష్ట్రాల్లోని ఎస్ఐ, సీఐ ర్యాంకు అధికారుల ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి నిందితులు డబ్బులు వసూలు చేశారు.హర్యానా, రాజస్థాన్ కు చెందిన నలుగురు సభ్యుల ముఠాను నల్గొండ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ నలుగురిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వీరి వెనుక ఎవరున్నారు. ఎంతమంది నుండి డబ్బులు వసూలు చేశారు. ఫేక్ ప్రొఫైల్స్ ఎలా క్రియేట్ చేశారనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

click me!