కొడుకులతో కలిసి భర్తను చంపిన భార్య..

Published : Jun 01, 2020, 07:47 AM ISTUpdated : Jun 01, 2020, 08:19 AM IST
కొడుకులతో కలిసి భర్తను చంపిన భార్య..

సారాంశం

ఈ క్రమంలో భర్త వేధింపులు భార్య పద్మ తట్టుకోలేకపోయింది. దీంతో.. ఆదివారం తెల్లవారుజామున నిద్రపోతున్న భర్తను చంపాలని ప్లాన్ వేసింది.

కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా హత్య చేసింది. అందుకు కన్న కొడుకుల సహాయం తీసుకుంది. ఈ దారుణ సంఘటన నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలోని దుబ్బ ప్రాంతంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. దుబ్బ ప్రాంతానికి చెందిన గంధం రమేష్(41), పద్మ దంపతులు తమ ఇద్దరు కుమారులతో కలిసి జీవిస్తున్నారు. కాగా.. కుటుంబ కలహాల నేపథ్యంలో ఇటీవల భార్య, భర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో భర్త వేధింపులు భార్య పద్మ తట్టుకోలేకపోయింది. దీంతో.. ఆదివారం తెల్లవారుజామున నిద్రపోతున్న భర్తను చంపాలని ప్లాన్ వేసింది.

తన ఇద్దరు కొడుకుల సహాయంతో భర్త గొంతు నులిమి చంపేసింది. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు