భర్త స్నేహితుడితో అక్రమ సంబంధం.. ప్రియుడితో మొగుడిని చంపించిన భార్య

Siva Kodati |  
Published : Aug 27, 2019, 08:41 AM ISTUpdated : Aug 27, 2019, 08:42 AM IST
భర్త స్నేహితుడితో అక్రమ సంబంధం.. ప్రియుడితో మొగుడిని చంపించిన భార్య

సారాంశం

శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఉపాధి కోసం హైదరాబాద్‌కు కుటుంబంతో కలిసి వలస వచ్చాడు. ఒడిశా రాష్ట్రం..గజపతి నగరం జిల్లా గౌరీ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కూడా శామీర్‌పేట మండలం సింగాయిపల్లి గ్రామంలో ఉంటున్నాడు. వీరిద్దరికి స్నేహం కుదరడంతో అప్పుడప్పుడు మేస్త్రి ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో అతని భార్యతో ఒడిశాకు చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది

వివాహేతర సంబంధానికి అడ్డుగా వున్నాడని కట్టుకున్న భర్తను దారుణంగా హత్య చేయించిందో భార్య. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఉపాధి కోసం హైదరాబాద్‌కు కుటుంబంతో కలిసి వలస వచ్చాడు.

శామీర్‌పేట మండలం బిట్స్ కాలనీలో నివసిస్తూ తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఒడిశా రాష్ట్రం..గజపతి నగరం జిల్లా గౌరీ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కూడా శామీర్‌పేట మండలం సింగాయిపల్లి గ్రామంలో ఉంటున్నాడు.

వీరిద్దరికి స్నేహం కుదరడంతో అప్పుడప్పుడు మేస్త్రి ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో అతని భార్యతో ఒడిశాకు చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇద్దరు వీలున్నప్పుడల్లా ఏకాంతంగా గడిపేవారు.

ఈ విషయం మేస్త్రికి తెలియడంతో ఇద్దరినీ మందలించాడు. తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య అతనిని అంతం చేయాలని నిర్ణయించుకుంది. దీనిలో భాగంగా ఆమె ఒడిశా వ్యక్తికి రూ.5 వేల రూపాయలను ఇచ్చింది.

పథకంలో భాగంగా ఈ నెల 14వ తేదీన మేస్త్రిని బైక్‌పై ఎక్కించుకున్న ఒడిశా వ్యక్తి... తూముకుంటలోని సత్యావైన్ వద్దకు వెళ్లి మద్యం బాటిళ్లు కొనుగోలు చేసి స్థానిక సురభి వెంచర్‌ వద్దకు తీసుకెళ్లాడు.

అప్పటికే మద్యం మత్తులో ఉన్న మేస్త్రితో ఒడిశా వ్యక్తి.. పీకల దాకా తాగించాడు. అనంతరం మద్యం బాటిల్స్ పగులగొట్టి.. మత్తులో ఉన్న మేస్త్రి కడుపులో పొడిచాడు. చనిపోయాడని నిర్థారించుకున్న తర్వాత అక్కడి నుంచి జారుకుని ఒడిశాలోని తన స్వగ్రామానికి చేరుకున్నాడు.

స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ నెల 26వ తేదీన తూముకుంట బస్టాప్‌లో ఉన్న ఒడిశా వ్యక్తిని... మేస్త్రి భార్యను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. 
 

PREV
click me!

Recommended Stories

Hyderabad Holi Celebrations 2026 at Tank Bund: హైదరాబాద్‌లో ఘనంగా హోలీ సంబరాలు| Asianet News Telugu
Ayatollah Ali Khamenei: ఖమేనీకి మద్దతుగా హైదరాబాద్ లో క్యాండిల్ ర్యాలీ| Asianet News Telugu