ప్రేమోన్మాదానికి మరో యువతి బలి: ప్రియుడి చేతిలో బీటెక్ విద్యార్ధిని హతం

Siva Kodati |  
Published : Aug 27, 2019, 08:29 AM IST
ప్రేమోన్మాదానికి మరో యువతి బలి: ప్రియుడి చేతిలో బీటెక్ విద్యార్ధిని హతం

సారాంశం

ప్రేమోన్మాదానికి మరో యువతి బలైపోయింది.. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తలంకపల్లికి చెందిన తేజస్విని మూడురోజుల క్రితం అదృశ్యమైంది. ఈ క్రమంలో ఆమె ఆచూకీ కోసం కుటుంబసభ్యులు తీవ్రంగా గాలించారు.. అయితే మంగళవారం తెల్లవారుజామున గ్రామ సమీపంలోని అటవీప్రాంతంలో తేజస్విని మృతదేహం లభించింది

ప్రేమోన్మాదానికి మరో యువతి బలైపోయింది.. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తలంకపల్లికి చెందిన తేజస్విని మూడురోజుల క్రితం అదృశ్యమైంది. ఈ క్రమంలో ఆమె ఆచూకీ కోసం కుటుంబసభ్యులు తీవ్రంగా గాలించారు..

అయితే మంగళవారం తెల్లవారుజామున గ్రామ సమీపంలోని అటవీప్రాంతంలో తేజస్విని మృతదేహం లభించింది. ఆమెకు పరిచయమున్న బీటెక్ విద్యార్ధి నితినే తేజస్వినిని హత్య చేసి ఉంటాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

డిప్లొమో చదివే సమయంలోనే నితిన్-తేజస్విని ప్రేమించుకున్నారని.. వీరి ప్రేమ విషయం ఇరు కుటుంబాల్లో తెలియడంతో పోలీసుల చేత కౌన్సెలింగ్ ఇప్పించినట్లుగా తెలుస్తోంది.

అయితే కౌన్సెలింగ్ తర్వాత కూడా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచిందని... ఇరువురికి కొద్దిరోజుల నుంచి గొడవలు జరుగుతున్నట్లుగా సమాచారం. నితిన్ మూడు రోజుల క్రితం తేజస్వినికి ఫోన్ చేసి మాట్లాడాలని చెప్పి.. పెనుబల్లికి రమ్మన్నట్టుగా తెలుస్తోంది.

తేజస్వినిని హత్య చేసిన అనంతరం నితిన్ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లుగా స్థానికులు చెబుతున్నారు. అయితే పోలీసులు మాత్రం ఈ విషయాన్ని ఇంతవరకు ధ్రువీకరించలేదు. 

PREV
click me!

Recommended Stories

Government Jobs : గట్టిగా ట్రై చేస్తే నెలకు రూ.1,27,050 జీతంతో ఓ సర్కార్ నౌకరీ మీదే.. టిజిపిఎస్సి జాబ్ నోటిఫికేషన్ ఫుల్ డిటెయిల్స్
Flash Floods Alert : తెలుగు రాష్ట్రాల్లో గోదావరి ఉగ్రరూపం.. పోటెత్తిన వరదనీరు, ఈ ప్రాంతాల్లో ప్లాష్ ప్లడ్స్ తప్పవా?