ఆస్తి మొత్తం అమ్మి చెల్లెళ్లకు ఇళ్లు... భర్తపై భార్య అక్కసు, చంపి దొడ్డికింద పాతేసింది

Siva Kodati |  
Published : Sep 02, 2021, 10:14 PM IST
ఆస్తి మొత్తం అమ్మి చెల్లెళ్లకు ఇళ్లు... భర్తపై భార్య అక్కసు, చంపి దొడ్డికింద పాతేసింది

సారాంశం

మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేట మండలం దర్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల చిన్నంబావి గ్రామానికి చెందిన చిన్నయ్య(45) ఇటీవల తనకున్న ఆస్తిని అమ్మేసి ఓ ఇంటిని నిర్మించి తన చెల్లెళ్లకు ఇచ్చాడు. ఈ విషయంపై చిన్నయ్య అతని భార్య రాములమ్మ మధ్య గొడవలు మొదలయ్యాయి. 

అక్రమ సంబంధాలు, కుటుంబ సమస్యలు, మనస్పర్థలు ఇలా కారణం ఏదైనా ఈ మధ్యకాలంలో భర్తను హతమారుస్తున్న భార్యలు పెరుగుతున్నారు. తాజాగా ఓ భార్య ఆస్తి తగాదాలతో భర్తను హత్య చేసి అనంతరం మృతదేహాన్ని ఇంట్లోని మరుగుదొడ్డి కింద పాతి పెట్టింది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేట మండలం దర్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల చిన్నంబావి గ్రామానికి చెందిన చిన్నయ్య(45) ఇటీవల తనకున్న ఆస్తిని అమ్మేసి ఓ ఇంటిని నిర్మించి తన చెల్లెళ్లకు ఇచ్చాడు.

ఈ విషయంపై చిన్నయ్య అతని భార్య రాములమ్మ మధ్య గొడవలు మొదలయ్యాయి. భర్త చేసిన పనితో విసుగు చెందిన రాములమ్మ ఆగ్రహంతో చిన్నయ్యను హత్య చేసి తన ఇంట్లోనే మరుగుదొడ్డి కింద పాతిపెట్టింది. అయితే గత రెండు నెలలుగా చిన్నయ్య కనిపించకపోవడంతో అతని సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో చిన్నయ్యను చంపింది రాములమ్మే అని పోలీసుల విచారణలో తేలింది. అనంతరం రాములమ్మ చెప్పిన వివరాల మేరకు పోలీసులు మరుగుదొడ్డి ఉన్న ప్రాంతంలో జేసీబీ సాయంతో ఇంటిని కూల్చేసి.. చిన్నయ్య మృతదేహాన్ని వెలికితీశారు. ఆపై రాములమ్మను అదుపులోకి తీసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Harish Rao Comments on Revanth Reddy:టెండర్లురద్దు చేసి సిబిఐవిచారణ జరిపించాలి | Asianet News Telugu
Airport: హైద‌రాబాద్ ఒక్క‌టే కాదు.. ఈ ప్రాంతాల్లో కూడా రియ‌ల్ బూమ్ ఖాయం. కొత్త ఎయిర్ పోర్టులు