సంగారెడ్డి జిల్లాలోని మైలాన్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు మృతి

Published : Jan 08, 2023, 03:13 PM ISTUpdated : Jan 08, 2023, 03:25 PM IST
సంగారెడ్డి జిల్లాలోని మైలాన్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు మృతి

సారాంశం

సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జిన్నారం మండలం గడ్డపోతారం మైలాన్ పరిశ్రమంలో మంటలు చెలరేగడంతో ముగ్గురు మృతిచెందారు. 

సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జిన్నారం మండలం గడ్డపోతారం మైలాన్ పరిశ్రమంలో మంటలు చెలరేగడంతో ముగ్గురు మృతిచెందారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని.. మంటలను అదుపుచేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే పరిశ్రమకు చెందిన గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తర్వాత అంతటా వ్యాపించాయి. ఇక, మృతులను లోకేశ్వర్‌రావు, పరితోష్‌ మెహత, రంజిత్‌కుమార్‌‌గా గుర్తించారు.

మరోవైపు పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు. ఇక, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

PREV
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే