ప్రేమించి, పెళ్ళి చేసుకున్న భర్తను.. గొడ్డలితో నరికి చంపిన భార్య..

Published : May 01, 2023, 03:57 PM IST
ప్రేమించి, పెళ్ళి చేసుకున్న భర్తను.. గొడ్డలితో నరికి చంపిన భార్య..

సారాంశం

ఓ భార్య ప్రేమించి, పెళ్లి చేసుకున్న భర్తను అత్యంత దారుణంగా హతమార్చింది. పడుకున్న అతడిని గొడ్డలితో నరికి చంపింది. 

మహబూబ్ నగర్ :  పెద్దల్ని ఎదిరించి.. తమ ప్రేమను గెలిపించుకుని.. వివాహం చేసుకున్న ఓ జంట ఆ తర్వాత ఒకరినొకరు నరుక్కుని చంపుకున్నారు. కులాలు వేరైనా ఇద్దరు ప్రేమించుకున్నారు. వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో.. వారిని ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.  సంతోషంగా గడిచిపోతున్న వీరి సంసారంలో మద్యం చిచ్చు పెట్టింది. భార్యాభర్తలిద్దరూ తాగుడుకు బానిస అయ్యారు. మద్యం సేవించి తరచుగా మత్తులో గొడవ పడుతుండేవారు. ఈ క్రమంలో విసిగిపోయిన భార్య.. నిద్రపోతున్న భర్తను గొడ్డలితో నరికి చంపింది.  

పిల్లలు వద్దని వారిస్తున్నా వినకుండా ఈ దారుణానికి తెగించింది.  ఆదివారం రాత్రి ఈ ఘటన ఇటిక్యాల మండలంలోని మొగిలి రావుల చెరువులో చోటుచేసుకుంది. ఇటిక్యాల ఏఎస్ఐ అయ్యన్న, స్థానికుల కథనం ప్రకారం.. మొగిలిరావుల చెరువు గ్రామానికి చెందిన దేవరాజు అలియాస్ దేవదాసు (35),  వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం చెల్లపాడుకు చెందిన అలివేలును 15 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.  

నూతన సచివాలయానికి వెళ్లేందుకు రేవంత్ రెడ్డి యత్నం.. అడ్డుకున్న పోలీసులు.. తీవ్ర ఉద్రిక్తత..

వీరిద్దరూ కూలీ పనులు చేసుకుంటూ సంసారాన్ని నెట్టుకొస్తున్నారు.  కాదా వీరిద్దరూ తాగుడుకు బానిస కావడంతో మద్యం మత్తులో తరచుగా గొడవలు పడుతుండేవారు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి దేవదాసు మద్యం తాగి ఇంటికి వచ్చాడు. భార్యతో గొడవపడ్డాడు. ఆ తర్వాత పడుకున్నాడు. ఈ గొడవలతో విసిగిపోయిన భార్య..  అర్ధరాత్రి పిల్లలు చూస్తుండగానే.. పడుకున్న భర్తను గొడ్డలితో విచక్షణారహితంగా నరికి చంపింది. పిల్లల కేకలతో  మేల్కొన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

అక్కడికి చేరుకున్న పోలీసులు స్థలానికి పరిశీలించి. శవపంచనామా చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని గద్వాల ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. మృతుడు దేవదాసుకు ఓ కుమారుడు కుమార్తె ఉన్నారు. దేవదాసు సోదరుడు రవి దీని మీద ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu