కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు: భర్తను చంపిన భార్య, వేధింపులే కారణం

Siva Kodati |  
Published : Jul 03, 2019, 11:15 AM IST
కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు: భర్తను చంపిన భార్య, వేధింపులే కారణం

సారాంశం

తాగుడుకు బానిసై తనను తీవ్రంగా వేధిస్తున్న భర్తను కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు ఇచ్చి హతమార్చింది భార్య

తాగుడుకు బానిసై తనను తీవ్రంగా వేధిస్తున్న భర్తను కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు ఇచ్చి హతమార్చింది భార్య. వివరాల్లోకి వెళితే... రెబ్బెన మండలంలోని లక్ష్మీపూర్‌కు చెందిన చౌదరి శంకర్‌కు 11 ఏళ్ల క్రితం ఆసిఫాబాద్ పరిధిలోని చిలాటిగూడకు చెందిన రూపతో వివాహమైంది. వీరికి హరిక, కీర్తణ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఈ క్రమంలో భార్యభర్తలకు తరచుగా గొడవలు జరుగుతుండేవి. దీంతో శంకర్ తాగుడుకు బానిసై భార్యను చిత్రహింసలకు గురిచేసేవాడు. సోమవారం సాయంత్రం శంకర్ కూల్‌డ్రింక్‌ కావాలని భార్యను కోరాడు.

దీంతో కూల్‌డ్రింక్ తెప్పించిన రూప బాటిల్‌లోని కొంత పిల్లలకు ఇచ్చి.. మిగిలిన దానిలో పురుగుల మందు కలిపి భర్తకు తాగించింది. దానిని తాగిన అతను కూల్‌డ్రింక్ చేదుగా ఉందని భార్యను నిలదీశాడు..

అప్పటికే శంకర్ పరిస్ధితి ఆందోళనకరంగా మారడంతో స్థానిక వైద్యుడితో పరీక్షించారు. పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో కాగజ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మంచిర్యాలకు తరలించేలోగా మరణించాడు.

పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది