ప్రజల కోసం: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యే హరిప్రియ

Siva Kodati |  
Published : Jul 03, 2019, 10:27 AM IST
ప్రజల కోసం: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యే హరిప్రియ

సారాంశం

ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ తన నియోజకవర్గంలోని ప్రజల ఇబ్బందులపై దృష్టి సారించారు. ఈ క్రమంలో ఆమె ఆర్టీసీ బస్సులో సాధారణ ప్రయాణికురాలిగా ప్రయాణించారు

ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ తన నియోజకవర్గంలోని ప్రజల ఇబ్బందులపై దృష్టి సారించారు. ఈ క్రమంలో ఆమె ఆర్టీసీ బస్సులో సాధారణ ప్రయాణికురాలిగా ప్రయాణించారు.

ప్రతిరోజూ ఖమ్మం నుంచి ఇల్లెందుకు వెళ్లేందుకు ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకునేందుకు ఆమె ఇలా చేశారు. తొలుత ఖమ్మం వెళ్లిన ఎమ్మెల్యే మంగళవారం రాత్రి ఖమ్మం ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్ళి  అక్కడి డిపో మేనేజర్‌తో మాట్లాడారు.

రాత్రి 8 గంటల తర్వాత ఖమ్మం నుంచి ఇల్లెందుకు బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని డీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఖమ్మం నుంచి కొత్తగూడెం, భద్రాచలం వెళ్లే బస్సులను ఇల్లెందు మీదుగా నడపాలని కోరారు. దీనికి డీఎం సానుకూలంగా స్పందించారు. అనంతరం ఎమ్మెల్యే ఆర్టీసీ బస్సులో ఇల్లెందు వరకు ప్రయాణించారు. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ