అమెరికాకు పారిపోతుండగా శివాజీ పట్టివేత: పాస్ పోర్టు సీజ్

Siva Kodati |  
Published : Jul 03, 2019, 10:42 AM ISTUpdated : Jul 03, 2019, 11:40 AM IST
అమెరికాకు పారిపోతుండగా శివాజీ పట్టివేత: పాస్ పోర్టు సీజ్

సారాంశం

టీవీ9 వాటాల వ్యవహారంలో హీరో శివాజీకి సైబరాబాద్ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. బుధవారం శంషాబాద్ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇచ్చిన సమాచారంతో ఆయను పోలీసులు అరెస్ట్ చేసి.. సైబరాబాద్ పీఎస్‌కు తరలించారు. 

టీవీ9 వాటాల వ్యవహారంలో హీరో శివాజీకి సైబరాబాద్ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. బుధవారం శంషాబాద్ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇచ్చిన సమాచారంతో ఆయను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అనంతరం సుమారు 3 గంటల పాటు అలంద మీడియా, టీవీ9 వాటాల కొనుగోలు తదితర అంశాలపై పోలీసులు శివాజీని విచారించారు.

దేశం విడిచి వెళ్లకుండా శివాజీ పాస్‌పోర్టును హైదరాబాదు సైబర్‌ క్రైం పోలీసులు బుధవారం సీజ్‌ చేశారు. అమెరికా పారిపోవడానికి  ప్రయత్నించిన శివాజీని బుధవారం ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయనను సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అనంతరం 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చి ఈ నెల 11న తమ ఎదుట విచారణకు హాజరుకావాల్సిందిగా చెప్పి ఇంటికి పంపించివేశారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది