ఖమ్మం జిల్లాలో దారుణం.. భార్య, ఆమె ప్రియుడిపై భర్త కత్తితో దాడి.. ఒకరు మృతి..

Published : May 30, 2022, 09:01 AM ISTUpdated : May 30, 2022, 11:33 AM IST
ఖమ్మం జిల్లాలో దారుణం.. భార్య, ఆమె ప్రియుడిపై భర్త కత్తితో దాడి.. ఒకరు మృతి..

సారాంశం

ఖమ్మంలో దారుణ ఘటన జరిగింది. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కారణంతో ఆమె, ఆమె ప్రియుడిమీద భర్త కత్తితో దాడి చేశాడు. ఇందులో ప్రియుడు మరణించగా, భార్య కోలుకుంటోంది. 

ఖమ్మం : తెలంగాణ రాష్ట్రంలోని Khammam జిల్లాలో దారుణం జరిగింది. వీరబాబు అనే వ్యక్తి తన wifeను, ఆమె lover నవీన్ ని knifeతో పొడిచాడు. గమనించిన స్థానికులు రక్తం మడుగులో పడి ఉన్న వారిని ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన నవీన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. వీరబాబు భార్య కల్పన ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తన భార్య కల్పనతో నవీన్ extramarital affair పెట్టుకున్నాడనే కోపంతోనే వీరబాబు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం మండలం అల్లీపురంలో జరిగింది.

కాగా యువకుడికి 20 రోజుల క్రితమే ఎంగేజ్మెంట్ అయ్యింది. జూన్ 9వ తేదీన పెళ్లి జరగాల్సి ఉంది. వివరాల్లోకి వెళితే…  అల్లిపురానికి చెందిన గట్ల నవీన్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి లో కాంట్రాక్టు పద్ధతిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన కల్పన అనే వివాహితతో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న కల్పన భర్త వీరబాబు దారుణానికి ఒడిగట్టాడు.  

ఆదివారం రాత్రి  నవీన్ ను ఖమ్మం శివారు ప్రాంతం గోపాలపురం వద్దకు రమ్మని కల్పన ఫోన్ చేయడంతో అతను అక్కడికి వచ్చాడు. ఆ తర్వాత  కల్పన భర్త వీరబాబు నవీన్ మీద విచక్షణారహితంగా కత్తితో దాడి చేయగా తీవ్ర గాయాలు అయ్యి అక్కడే కుప్పకూలిపోయాడు. ఈ ఘటనలో కల్పనకు కూడా స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న నవీన్ బంధువులు వెంటనే అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

అక్కడ చికిత్స పొందుతూ నవీన్ అర్ధరాత్రి 12 గంటల సమయంలో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా ఇరవై రోజుల క్రితం నవీన్కు ఎంగేజ్మెంట్ జరిగింది. జూన్ 9న మృతుడు నవీన్ కు వివాహం జరగాల్సి ఉంది. మరోవైపు పథకం ప్రకారమే కల్పన, వీరబాబు నవీన్ ను గోపాలపురానికి పిలిచి హత్యా యత్నం చేశారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. 

ఇదిలా ఉండగా,  కాగా, మే 11న… ముంబైలో సకినాకాలోని ఖైరానీ రోడ్డు ప్రాంతంలో  మనోజ్ ప్రజాపతి, అతని భార్య రీమా బోలా యాదవ్ నివసిస్తున్నారు. అయితే, ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. వారు గత రెండు రోజులుగా విడివిడిగా నివసించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో అనుకోకుండా ఒక రోజు రీమా స్నేహితురాలు.. రీమా ఇంటికి వచ్చి చూసేటప్పటికీ ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో స్నేహితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు.

ఈ క్రమంలో రీమా భర్తను అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే అతను తొలుత కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాడు. కానీ,  నిందితుడి గోళ్లపై ఉన్న రక్తపు మరకలు అతన్ని పట్టుబడేలా చేశాయని పోలీసులు తెలిపారు. రీమా తన మొబైల్లో చివరిసారిగా తన భర్తతోనే సంభాషించినట్లు వెల్లడించారు. దీంతో పోలీసులు రీమా భర్తను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?