భర్తను చంపి అడవిలో పాతి పెట్టిన భార్య.. !

Published : Jan 21, 2021, 10:59 AM IST
భర్తను చంపి అడవిలో పాతి పెట్టిన భార్య.. !

సారాంశం

 జయశంకర్ భూపాలపల్లి జిల్లా, భూపాలపల్లి మండలం నేరేడుపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తనే కడతేర్చిందో ఇల్లాలు.  భర్తను తండ్రి సహాయంతో హత్య చేసి దగ్గర్లోని అటవీ ప్రాంతంలో పాతిపెట్టింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం నర్సక్క పల్లి కి చెందిన రమేష్ తాపీ మేస్త్రి, రమేష్ శారద దంపతులకు ఓ కూతురు కుమారుడు, కొద్దిరోజులుగా వీరింట్లో కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఇటీవల భర్త రమేష్ ను అత్తగారిల్లైన నేరేడుపల్లి తీసుకెళ్లారు. 

ఆ తర్వాత రమేష్ కనిపించకుండా పోయాడు.తన భర్త కనిపించడం లేదంటూ భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో భార్య శారద ఫిర్యాదు చేసింది. అనంతరం రమేష్ బంధువుల పెళ్లికి కూడా వెళ్లి వచ్చింది. నెల తర్వాత అసలు విషయం బయటపడింది. 

చనిపోయిన వారికి చేయాల్సిన కార్యక్రమాలను శారద చేసింది. నెల మాసికం పెట్టింది. ఇవన్నీ చూసి అనుమానం వచ్చిన బంధువులు గ్రామస్తులు నిలదీయగా తానే చంపినట్టు ఒప్పుకొంది. అనంతరం పోలీసుల ముందు లొంగిపోయింది. 

పోలీసులు తమదైన శైలిలో విచారించగా రమేష్ ను తన తండ్రి తో కలిసి చంపేసినట్లు శారద ఒప్పుకుంది. అనంతరం అడవిలో పాతి పెట్టినట్లు పేర్కొంది. రమేష్ బంధువుల ఫిర్యాదు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
 
PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : చలి నుండి ఉపశమనం మూన్నాళ్ల ముచ్చటే.. మళ్లీ గజగజలాడించే చలి, పొగమంచు ఎక్స్ట్రా
Bullet Train India: దూసుకొస్తున్న బుల్లెట్ ట్రైన్.. హైదరాబాద్, అమరావతి రూట్లలో గంటలో ప్రయాణం