భార్య సూసైడ్ చేసుకుందని.. భర్త కూడా..

Published : Dec 14, 2018, 02:00 PM IST
భార్య సూసైడ్ చేసుకుందని.. భర్త కూడా..

సారాంశం

భార్య ఆత్మహత్య చేసుకొని మృతిచెందడాన్ని చూసి తట్టుకోలేని భర్త కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా.. కొన ఊపిరితో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. 

భార్య ఆత్మహత్య చేసుకొని మృతిచెందడాన్ని చూసి తట్టుకోలేని భర్త కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా.. కొన ఊపిరితో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

మల్కాజిగిరికి చెందిన కల్లోలు సంతోష్(35)కి ఉప్పల్ కిచెందిన రజినీ(29)తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. సంతోష్ ఆర్టీసీ జీడీమెట్ల డిపోలో మెకానిక్ గా పనిచేస్తున్నాడు. వివాహం జరిగిన నాటి నుంచి భార్య భర్తలు ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఏనాడు చిన్న గొడవ కూడా పడలేదట. అలాంటిది గురువారం తెల్లవారుజామున సంతోష్ నిద్రలేచి చూసేసరికి.. భార్య రజినీ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని కనిపించింది.

ఈ విషయాన్ని తన బావమరిదికి ఫోన్ చేసి చెప్పి.. అనంతరం సంతోష్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సంతోష్ ని సమీపంలోని ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. సంతోష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు.

అయితే.. రజినీ ఎందుకు ఆత్మహత్య చేసుకుందనే విషయం మిస్టరీగా మారింది. కనీసం ఇంట్లో చిన్నపాటి గొడవ కూడా జరగలేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. కాగా.. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?