టీఆర్ఎస్ ఎంపీల రాజీనామా....

By Arun Kumar PFirst Published Dec 14, 2018, 1:53 PM IST
Highlights

టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు తమ లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తెలంగాణ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన చేవెళ్ల ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఇటీవలే మేడ్చల్ ఎమ్మెల్యేగా గెలిచిన చామకూర మల్లారెడ్డిలు తమ పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వీరు తమ రాజీనామా లేఖను లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్ కు అందజేశారు. అయితే పెద్దపల్లి ఎంపీ మాల్క సుమన్ కూడా చెన్నూరు నుండి ఎమ్మెల్యేగా గెలిచినా ఇంకా ఎంపీ పదవిని వదులుకోలేదు. 
 
టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ద్రోహులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ... తెలంగాణవాదులను పట్టించుకోవడం లేదని పేర్కొంటూ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎంపీ కోండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎన్నికలకు ముందు ఈ పరిణామం జరగడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. విశ్వేశ్వర్ రెడ్డితో కేటీఆర్ పలు ధపాలు మంతనాలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. ఎట్టకేలకు అతడు పార్టీని కాంగ్రెస్ లో చేరారు. తాజాగా తన ఎంపీ పదవికి కూడా విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా చేశారు. 

ఇక మల్కాజ్ గిరి ఎంపిగా కొనసాగుతున్న చామకూర మల్లారెడ్డికి టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం మేరకు మేడ్చల్ ఎమ్మెల్యేగా  బరిలోకి దిగారు. తాజాగా అతడు ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను అందించడానికి వెళ్లిన మల్లారెడ్డిని స్పీకర్ సుమిత్రా మహజన్ అభినందనలు తెలిపారు.    

టీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో ఎంపీ బాల్క సుమన్ కూడా చెన్నూరు నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో అతడు కూడా ఎంపీ పదవిని వీడనున్నారు. అయితే ఆయన ఇంకా ఎంపీ పదవికి రాజీనామా మాత్రం చేయలేదు. 

click me!