
ఖమ్మం : తమextramarital affairకి అడ్డుగా ఉన్నాడని భావించి husband తాగే liquorలో విషం (కుక్కలను చంపే మందు) కలిపి హతమార్చిన భార్యను పోలీసులు అరెస్టు చేశారు. ఇదే కేసులో ఆమెకు సహకరించిన ప్రియుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. తిరుమలాయపాలెం మండలంలోని సుబ్లేడు గ్రామానికి చెందిన డాబా కనకరాజు (37)కు భార్య విజయతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఆమెకు అదే గ్రామానికి చెందిన పంచాయతీ వాటర్ manora పాపయ్య తో వివాహేతర సంబంధం ఏర్పడింది. కొన్నాళ్లకు విషయం బయటపడడంతో దంపతుల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో విజయ పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటినుంచి ఫోన్ లో సంప్రదింపులు జరుపుతోంది. అయితే పరిస్థితి కొలిక్కి రాకపోవడం.. తన వివాహేతర సంబంధానికి దెబ్బ పడేలా ఉండాల్సి రావడంతో.. భర్తను అడ్డు తొలగించుకోవాలని భావించింది. దీనికి ప్రియుడితో సంప్రదింపులు చేసి హత్య చేయాలని నిర్ణయించుకున్నారు.
అందులో భాగంగానే సూర్యాపేట జిల్లా మోతే మండలం తుమ్మగూడెంలో కృష్ణ అనే వ్యక్తి వద్ద కుక్కలనుచంపే మందు కొనుగోలు చేశారు. గత నెల 30న రాత్రి సమయంలో షేక్ మస్తాన్ ద్వారా ఓ మద్యం బాటిల్ లో కలిపి కనకరాజు ఇవ్వాలి అని చెప్పి పంపించారు. ఆ మందు తాగిన కనకరాజు ఇంటికి వెళ్ళాక కాళ్ళు, చేతులు లాగుతున్నాయి అని చెప్పడంతో.. కుటుంబసభ్యులు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కనకరాజు మృతి చెందాడు.
అయితే తన కుమారుడి మృతిపై అనుమానం ఉందని, మద్యంలో విషం కలిపి ఉంటారని తల్లి భద్రమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రియుడితో కలిసి ఉండేందుకు తన భర్త అడ్డు తొలగించుకోవాలని ఉద్దేశంతోనే భార్య ఈ ఘాతుకానికి ఒడిగట్టింది అని పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఓర పాపయ్య, దావా విజయను సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు కూసుమంచి సీఐ సతీష్ తెలిపారు.
ఇదిలా ఉండగా, మార్చి 25న ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నెల 9న నార్పల మండలం నాయన పల్లిలో చోటుచేసుకున్న అట్టే నారాయణస్వామి murderలో మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివరాలను సీఐ విజయ భాస్కర్ రెడ్డి, ఎస్సై వెంకట ప్రసాద్ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. వీర నారప్ప గౌడ్, నారాయణ స్వామి అన్నదమ్ములు. అన్న వీర నారప్ప భార్య పద్మావతితో నారాయణస్వామి extramarital affair కొనసాగించేవాడు. విషయం తెలుసుకున్న అన్న హెచ్చరికతో పద్మావతిలో మార్పు వచ్చింది.
అయితే తన కోరిక తీర్చాలంటూ నారాయణస్వామి వేధిస్తుండడంతో ఈ విషయాన్ని భర్తకు తెలిపింది. దీంతో తమ్ముడిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం ఈ నెల 9న రాత్రి 9 గంటలకు తన పొలంలోని చింతచెట్టు వద్దకు నారాయణస్వామిని రప్పించుకున్నారు. పద్మావతితో మాట్లాడుతుండగా అప్పటికే మాటువేసి ఉన్న అన్న వీర నారప్పతో పాటు పెద్ద నాన్న కుమారుడు పెద్ద వీర నారప్ప దాడి చేశారు.
కిందపడిన మరిది చేతులను పద్మావతి, కాళ్లను పెద్ద వీర నారప్ప పట్టుకోగా.. నారాయణస్వామి బీజాలపై అన్న బలంగా తన్ని సీసా ముక్కతో మర్మాంగాన్ని కోశాడు. తర్వాత మెడలోని తాయత్తు దారం తీసి నారాయణస్వామి గొంతు బిగించి హతమార్చాడు. కేసు దర్యాప్తులో భాగంగా బుధవారం సాయంత్రం అనుమానంతో వీర నారప్ప అదుపులోకి తీసుకొని విచారణ చేయడంతో అసలు విషయం తెలిసింది. దీంతో అట్టే వీర నారప్ప, పెద్ద వీర నారప్పను గురువారం అరెస్టు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించారు.