ప్రియుడి మోజులో భర్త మెడకు చున్నీ బిగించి హత్య.. అర్థరాత్రి ప్రియుడితో కలిసి శవాన్ని మాయం చేస్తూ..

Published : Jan 11, 2022, 08:39 AM IST
ప్రియుడి మోజులో భర్త మెడకు చున్నీ బిగించి హత్య.. అర్థరాత్రి ప్రియుడితో కలిసి శవాన్ని మాయం చేస్తూ..

సారాంశం

ఆదివారం వెంకటయ్య ఇంట్లో పడుకున్న విషయాన్ని మాధవి రమేష్ కు చేరవేసింది. అతడు తన మిత్రుడు కుర్మయ్యతో కలిసి ద్విచక్ర వాహనంపై రాత్రి 11 గంటల ప్రాంతంలో బుద్ధారం వచ్చాడు. ఆ తరువాత వెంకటయ్య ను అందరూ కలిసి చున్ని గొంతుకు బిగించి చంపేశారు. మద్యం తాగి రోడ్డుపై పడి చనిపోయాడని చిత్రీకరించారని పథకం పన్నారు. 

మహబూబ్ నగర్ జిల్లా : Extramarital affair కోసం ప్రియుడితో కలిసి భర్త  ఉసురు తీసింది ఓ భార్య. ఆదివారం అర్ధరాత్రి Mahabubnagar Districtలో సినీఫక్కీలో జరిగిన ఘటన ఇది. హన్వాడ మండలం పెద్దదర్పల్లి గ్రామానికి చెందిన మొద్దు వెంకటయ్య (30)..ఇదే మండలం బుద్ధారం గ్రామానికి చెందిన మాధవిని పెళ్లి చేసుకుని ఇల్లరికం వచ్చాడు.

కొంతకాలం క్రితం హైదరాబాద్ కు వలస వచ్చిన మాధవికి నాగర్ కర్నూలుకు చెందిన జంగం రమేష్ తో Facebook లో పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. తిరిగి బుద్ధారం వచ్చిన తర్వాత రమేష్ తరచూ ఆమె దగ్గరికి వచ్చి వెళ్లేవాడు. ఈ క్రమంలో తమకు అడ్డుగా ఉన్న వెంకటయ్యను చంపేయాలని వారిద్దరూ ఓ నిర్ణయానికి వచ్చారు.

ఆదివారం వెంకటయ్య ఇంట్లో పడుకున్న విషయాన్ని మాధవి రమేష్ కు చేరవేసింది. అతడు తన మిత్రుడు కుర్మయ్యతో కలిసి ద్విచక్ర వాహనంపై రాత్రి 11 గంటల ప్రాంతంలో బుద్ధారం వచ్చాడు. ఆ తరువాత వెంకటయ్య ను అందరూ కలిసి చున్ని గొంతుకు బిగించి చంపేశారు. మద్యం తాగి రోడ్డుపై పడి చనిపోయాడని చిత్రీకరించారని పథకం పన్నారు. రమేష్, కుర్మయ్య ద్విచక్రవాహనంపై తమ మధ్య వెంకటయ్య మృతదేహాన్ని కూర్చోబెట్టుకుని బయలుదేరారు.

అయితే వీరు ఒకటి అనుకుంటే మరొకటి జరిగింది. ఇదే సమయంలో  మహ్మదాబాద్ ఎస్సై రవి ప్రకాష్, సిబ్బంది జిల్లా కేంద్రం నుంచి వాహనాల్లో వెళ్తున్నారు. టూ వీలర్ మీద వెడుతున్న వీరిని చూసి.. ఎస్సై కి అనుమానం వచ్చి వారిని ఆపి ప్రశ్నించగా వెంకటయ్య తాగి ఉండటంతో ఇంటికి తీసుకు వెళ్తున్నామని బుకాయించారు. ఎస్సైగట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం చెప్పేశారు. నిందితులను హన్వాడ పోలీసులకు అప్పగించారు. వెంకటయ్య దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. హత్య చేసినప్పుడు వారు ఇంట్లోనే పడుకున్నారు. 

ఇదిలా ఉండగా, నల్గొండ  జిల్లాలోని చింతపల్లి మండలంలో సోమవారం దారుణ హత్య జరిగింది. మైసమ్మ గుడి వద్ద మొండెం లేని మనిషి తల కనిపించడం‌తో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వివరాలు.. ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన దుండగులు.. హైదరాబాద్-నాగార్జున రాష్ట్ర రహదారిని అనుకుని చింతపల్లి మండలం విరాట్‌నగర్‌లో ఉన్న మెట్టు మహంకాళి దేవాలయంలో తల భాగాన్ని వదిలివెళ్లారు. 

మైసమ్మ గుడి ముందు ఉన్న పోతురాజు విగ్రహం వద్ద తలను ఉంచారు. సోమవారం ఉదయం దీనిని గుర్తించిన  స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసుకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇతర శరీరభాగాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

అసలు ఆ తల ఎవరిదో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.  అయితే అర్దరాత్రి వేళ నరబలి జరిగి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ వ్యక్తిని ఆలయం వద్దే హత్య చేశారా..? లేక ఎక్కడైనా హత్య చేసిన తలను ఇక్కడకు తీసుకొచ్చి వదిలివెళ్లారా..? అనేది తేలాల్సి ఉంది. ఇక, ఇది హత్య..? లేక నరబలా..? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad Cold Wave Alert | వాతావరణ పరిస్థితులపై IMD ధర్మరాజు కీలక సమాచారం | Asianet News Telugu
IMD Rain Alert : ఇక మంచు తుపాను బీభత్సం... ఆ ప్రాంతాల్లో అల్లకల్లోలమే..!