నువ్వు చచ్చిపో.. ప్రియుడితో కలిసి భార్య వేధింపులు.. భర్త ఆత్మహత్య..

Published : Mar 18, 2021, 11:10 AM ISTUpdated : Mar 18, 2021, 11:14 AM IST
నువ్వు  చచ్చిపో.. ప్రియుడితో కలిసి భార్య వేధింపులు.. భర్త ఆత్మహత్య..

సారాంశం

నువ్వు బతికి ఉండటం వృథా, చచ్చిపో.. అని ఓ భార్య భర్తను వేధింపులకు పాల్పడడంతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో కలకలం రేపింది.  భార్య ఆమె ప్రియుడు వేధింపులు తాళలేక భర్త వరద కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 

నువ్వు బతికి ఉండటం వృథా, చచ్చిపో.. అని ఓ భార్య భర్తను వేధింపులకు పాల్పడడంతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో కలకలం రేపింది. భార్య ఆమె ప్రియుడు వేధింపులు తాళలేక భర్త వరద కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 

మల్యాల మండలంలోని నూకపల్లిలో చోటుచేసుకున్న ఈ ఘటన మీద ఎస్ఐ నాగరాజు కథనం ప్రకారం వివరాలు.. మల్యాల కు చెందిన రాజు(30)కు గొల్లపల్లి మండలం బొంకూరు గ్రామానికి చెందిన రమ్యతో ఏడాది కిందట వివాహం జరిగింది. తర్వాత రమ్యకు తుంగూరుకు చెందిన రాజేందర్ తో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు రాజుకు తెలిసింది.  

ఈ క్రమంలో రాజేందర్ తో ఆమె చనువుగా ఉండటం చూసిన రాజు పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించినా రమ్య పెడచెవిన పెట్టింది. అంతేకాదు కొద్ది రోజుల కిందట రమ్య గర్భం దాల్చింది. అయితే ఆ గర్భం తన తన ప్రియుడి వల్లే వచ్చిందని చెప్పి తల్లి గారి ఇంటికి వెళ్లి అబార్షన్ చేయించుకుంది. 

ఆ తరువాత రాజుకు వేధింపులు మొదలుపెట్టింది.  ‘నువ్వు బతికి ఉండటం వృథా, చచ్చిపో’ అంటూ రమ్యతో పాటు ప్రియుడు రాజేందర్ ఫోన్లో తరచూ రాజును మానసికంగా వేధించేవారు దీంతో మనస్తాపం చెందిన అతను మంగళవారం రాత్రి ఇంటినుంచి వెళ్లిపోయి నూకపల్లి శివారులోని వరద కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

రాజు కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు వరద కాలువ వద్ద వెతకగా.. అక్కడ రాజు బైక్ తో పాటు, చెప్పులు కనిపించాయి.  కాలువలో గాలించగా మృతదేహం లభ్యమైంది. తన కుమారుడు మృతికి కోడలు ఆమె ప్రియుడే కారణమని మృతుడి తండ్రి నాగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

Half Day Schools : తెలుగు విద్యార్థులు ఎగిరిగంతేసే వార్త.. ఫిబ్రవరి 19 నుండే ఆ స్కూళ్లకు ఒంటిపూట
IMD Rain Alert : బంగాళాఖాతంలో అల్లకల్లోలం... ఈ ప్రాంతాల్లో ఏకంగా 30మిమీ వర్షపాతం తప్పదా..?