మరో వ్యక్తితో మహిళ సాన్నిహిత్యం: ఆమె కూతుర్ని చంపిన కరుణాకర్

Published : Jul 02, 2020, 03:16 PM ISTUpdated : Jul 02, 2020, 06:17 PM IST
మరో వ్యక్తితో మహిళ సాన్నిహిత్యం: ఆమె కూతుర్ని చంపిన కరుణాకర్

సారాంశం

మహిళ అక్రమ సంబంధానికి ఆరేళ్ల కూతురు బలి అయింది. భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనే కోపంతో ఓ వ్యక్తి ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో తన ఆరేళ్ల కూతురిని గొంతు కోసి హత్య చేశాడు.

మేడ్చెల్: తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చెల్ జిల్లాలో దారుణమైన సంఘటన జరిగింది. మహిళపై ఆగ్రహంతో ఓ వ్యక్తి ఆమె ఆరేళ్ల కూతురిని గొంతు కోసి హత్య చేశాడు. ఆమె మరో వ్యక్తితో సాన్నిహిత్యాన్ని పెంచుకుని, తనను పట్టించుకోవడం లేదనే కోపంతో అతను ఆ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. వీఆర్వో కల్యాణ్, అతని భార్య అనూషల కూతురిని కరుణాకర్ అనే వ్యక్తి చంపాడు. ఆ తర్వాత తాను ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కరుణాకర్ కు, అనూషకు మధ్య కొన్నాళ్లుగా పరిచయం ఉంది. మరో వ్యక్తితో సాన్నిహిత్యం పెంచుకుందనే కోపంతో ఆ దురాగతానికి పాల్పడినట్లు తెలుస్తోంది. 

మేడ్చెల్ జిల్లా ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఇస్మాయిల్ ఖాన్ గుడా విహారీ హోమ్స్ లో ఆ సంఘటన జరిగింది. మహిళ ఓ యువకుడు ఉండడాన్ని గర్తించిన కరుణాకర్ ఆమె కూతురు ఆద్యను చంపినట్లు తెలస్తోంది. కల్యాణ్ కు ఈ సంఘటనతో సంబంధం లేనట్లు తెలుస్తోంది.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని కరుణాకర్ గా గుర్తించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. మరో వ్యక్తితో కూడా అక్రమ సంబంధం పెట్టుకుందనే కోపంతో ఆమె కూతురిపై అతను కక్ష పెంచుకుంటున్నట్లు తెలుస్తోంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతురాలిని ఆద్యగా గుర్తించారు. కరుణాకర్ ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

PREV
click me!

Recommended Stories

పోక్సో చట్టం యొక్క భయంకరమైన నిజాలు POCSO case explained Telugu | Asianet News Telugu
నిఘా నీడలో తెలంగాణ ఆర్టీసీ ఆకతాయిలు, పోకిరీలకు చెక్ | CCTV in TSRTC buses | Asianet News Telugu