కరోనా ఎఫెక్ట్: ఈ ఏడాది 27 అడుగులకే ఖైరతాబాద్ వినాయక విగ్రహం

By narsimha lode  |  First Published Jul 2, 2020, 2:26 PM IST

ఈ ఏడాది 27 అడుగుల ఎత్తులోనే వినాయక విగ్రహాన్ని తయారు చేయాలని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటి నిర్ణయం తీసుకొంది. ధన్వంతరి గణేషుడిగా ఈ ఏడాది నామకరణం చేసినట్టుగా ఉత్సవ కమిటి తెలిపింది.


హైదరాబాద్:  ఈ ఏడాది 27 అడుగుల ఎత్తులోనే వినాయక విగ్రహాన్ని తయారు చేయాలని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటి నిర్ణయం తీసుకొంది. ధన్వంతరి గణేషుడిగా ఈ ఏడాది నామకరణం చేసినట్టుగా ఉత్సవ కమిటి తెలిపింది.

కరోనా కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో పెరిగిపోతున్న నేపథ్యంలో ఆన్ లైన్ లో కూడ ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకొనే వెసులుబాటును కల్పించనున్నట్టుగా ఉత్సవ కమిటి తెలిపింది.

Latest Videos

undefined

భౌతిక దూరం పాటిస్తూ భక్తులకు స్వామి వారిని దర్శనం కల్పించేలా జాగ్రత్తలు తీసుకొంటామని కమిటి వివరించింది.భక్తులకు దర్శనం కల్పించే విషయమై ప్రభుత్వం అనుమతి తీసుకొంటాయన్నారు.

గత ఏడాది 65 అడుగులతో ద్వాదశాదిత్య గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 38 అడుగుల మేర విగ్రహం ఎత్తు తగ్గింది.

ఇప్పటివరకు ఖైరతాబాద్ విగ్రహన్ని తయారు చేసిన శిల్పి రాజేందర్ ఈ ఏడాది కూడ విగ్రహన్ని తయారు చేయనున్నాడు.  ఈ విగ్రహాన్ని తయారు చేసేందుకు గుజరాత్ రాష్ట్రం నుండి మట్టిని తీసుకురానున్నారు. 

;ప్రతి ఏటా ఒక్కో అడుగు పెంచుతూ విగ్రహన్ని తయారు చేస్తోంది. గత ఏడాది 65 అడుగులతో ఏర్పాటు చేసింది. ఈ ఏడాది 66 అడుగులతో విగ్రహాన్ని ఏర్పాటు చేయాాల్సి ఉండగా, కరోనా కారణంగా 27 అడుగులకే పరిమితం చేసింది ఉత్సవ కమిటి. 1954 నుండి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటి ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తొలుత ఒక్క అడుగుతో విగ్రహం తయారీని ప్రారంభించారు. 
 

click me!