Election Code: తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికల కోడ్

Published : Dec 04, 2023, 10:51 PM IST
Election Code: తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికల కోడ్

సారాంశం

Election Code: తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ ముగిసింది. ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఎలక్షన్ కోడ్ ముగిసినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.

Election Code: ఎంతో ఉత్కంఠగా సాగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections) ప్రక్రియ ముగిసింది. దీంతో నేటితో ఎన్నికల కోడ్ ముగిసింది. ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ (Election commission) వెల్లడించింది. ఈ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ అధికారం కోల్పోయి.. కాంగ్రెస్ గెలుపొందింది. దీంతో సీఎం, కేబినేట్ ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్టోబర్ 9వ తేదీ నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే.

నేటితో ఆ నియమావళిని కేంద్ర ఎన్నికల సంఘం ఎత్తివేసినట్లు ప్రకటించింది. తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి. ఇలా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఆ రాష్ట్రాల్లో కూడా ఎన్నికల కోడ్‌ (Election code)ను ఎత్తివేస్తున్నట్లు సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌కి 50 కి.మీల దూరంలో రూ. 500 కోట్ల‌తో ప్ర‌పంచ టూరిస్ట్ సెంట‌ర్‌.. ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Summer Holidays Extended : ఈ నెలంతా వేసవి సెలవులే.. జూలై ఫస్ట్ కే స్కూల్స్ రీఓపెన్