సెగలు రేపిన తెలంగాణ సర్వే చేసిందెవరబ్బా ?

First Published Dec 18, 2017, 5:55 PM IST
Highlights
  • సోషల్ మీడియాలో హాట్ టాపిక్
  • ఎవరు చేశారని ప్రశ్నల వర్షం

తెలంగాణలో ఒక సర్వే ఫలితం సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. తెలంగాణలో రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ అధికారం కోల్పోతుందని, రెండో పెద్ద పార్టీగా టిఆర్ఎస్ మిగిలిపోతుందని సర్వేలో వెల్లడైంది. టిఆర్ఎస్ 49 సీట్ల దగ్గరే ఆగిపోతుందని తేల్చారు. ఇక ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ 52 సీట్లతో అతి పెద్ద పార్టీగా నిలుస్తుందని, టిడిపి 2 సీట్లు, ఎంఐఎం 7, బిజెపి 8 సీట్లు కైవసం చేసుకుంటుందని వెల్లడించారు. సిపిఎం 1 స్థానంలో గెలుస్తుందన్నారు. మరి ఇంతకూ ఈ సర్వే ఎవరు చేశారబ్బా అన్న ఆసక్తి జనాల్లో నెలకొంది.

ఈ సర్వే ను ఉస్మానియా విద్యార్థులు చేశారని తాజాగా సమాచారం అందుబాటులోకి వచ్చింది. ఇటీవల కాలంలో తాజా పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ఉస్మానియా విద్యార్థులు ఈ సర్వే చేసినట్లు తెలిసింది. అయితే సర్వే చేసిన ఉస్మానియా విద్యార్థులు ఎవరు? అన్న వివరాలు ఇంకా వెలుగులోకి రాలేదు. ఒకవేళ ఉస్మానియా  రిసేర్చ్ స్కాలర్స్ ఏదైనా సర్వే చేస్తే తమ పేరు, వివరాలు కూడా చెప్పుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ ఇది మా సర్వే అని ఎవరూ వెల్లడించలేదు.

అయితే నిజంగానే ఉస్మానియా విద్యార్థులే సర్వే చేశారా? లేక ఇంకెవరైనా చేశారా అన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఆ సర్వేను ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఒక మీడియా ప్రతినిధి చేయించారని కూడా సమాచారం వచ్చింది.

ఏది ఏమైనా ఈ సర్వే ఫలితాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

పూర్తి స్థాయి సర్వే ఫలితాల కోసం కింది లింక్ క్లిక్ చేయండి

https://goo.gl/qPwyMH

click me!