ఆ తెల్లపులి చనిపోయింది..!

By telugu news teamFirst Published Jun 26, 2020, 9:36 AM IST
Highlights

గత నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కిరణ్.. చికిత్స పొందుతూ మృతి చెందింది.

హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ లో సందర్శకులను ఎంతగానో ఆకట్టుకునే తెల్లపులి ఇక లేదు. ఆ తెల్ల పులి(కిరణ్) గురువారం చనిపోయింది. గత కొంతకాలంగా అది అనారోగ్యంతో బాధపడుతోందని అందుకే చనిపోయిందని అధికారులు తెలిపారు. ఎనిమిది సంవత్సరాల క్రితం ఈ పులి ఇదే జూలో జన్మించింది.

అప్పుడు దానికి కిరణ్ అని పేరు పెట్టారు. గత నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కిరణ్.. చికిత్స పొందుతూ మృతి చెందింది.

పులి మెడకు వాపు కనిపించినప్పటి నుంచి వెటర్నరీ డాక్టర్లు ట్రీట్ మెంట్ అందించారు. నెల రోజుల నుంచి పులి ఆరోగ్యం మరింత విషమించడంతో ప్రత్యేక డాక్టర్ల బృందం చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. పోస్టుమార్టం నిర్వహించిన వెటర్నరీ డాక్టర్లు పులి మెడ భాగం నుంచి కణితిని బయటికి తీశారు.

గత ఏడాది అగస్టు నెలలో 14 ఏళ్ల తెల్ల పులి(బద్రి) కూడా అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయిన విషయం తెలిసిందే. అయితే తెల్ల పులి బద్రి కూడా ఇదే రకమైన అనారోగ్య సమస్యతో చనిపోయింది.

click me!