జ్యూస్ లో మత్తుమందు కలిపి.. యువతిపై అత్యాచారం, గర్భం రావడంతో..

Published : Jun 26, 2020, 07:46 AM IST
జ్యూస్ లో మత్తుమందు కలిపి.. యువతిపై అత్యాచారం, గర్భం రావడంతో..

సారాంశం

ఆమె మత్తులోకి జారుకున్న తర్వాత అత్యాచారం చేసేవాడు. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చిది. యువతి త్వరలో బిడ్డను కూడా ప్రసవించనుంది. 

నిమ్మరసంలో మత్తుమందు కలిపి ఇచ్చిన వంటవాడు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ యువతి (19) కాచిగూడ పోలీసులను ఆశ్రయించింది. లాలాపేటలో నివాసముంటున్న బాధితురాలు బర్కత్‌పురలోని ఓ ఆస్పత్రిలో ఆయాగా పనిచేస్తుంది. అదే ఆస్పత్రిలో పీర్జాదిగూడకు చెందిన రవి(40) వంటవాడిగా పనిచేస్తున్నాడు. 

రవి ఆమెకు నిమ్మరసంలో మత్తు మాత్రలు కలిపి ఇచ్చేవాడు. ఆమె మత్తులోకి జారుకున్న తర్వాత అత్యాచారం చేసేవాడు. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చిది. యువతి త్వరలో బిడ్డను కూడా ప్రసవించనుంది. కాగా... విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు ఆమెను ఈ విషయంలో   నిలదీశారు. దీంతో బాధితురాలు జరిగిన విషయం చెప్పింది. గురువారం ఆ యువతి కాచిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రవిపై అత్యాచారం కేసు నమోదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Jobs: ఇక‌పై తెలంగాణ యువ‌త‌కు జ‌పాన్‌లో ఉద్యోగాలు.. ప్ర‌భుత్వం కీలక నిర్ణ‌యం
Kavitha: పెళ్లి కూతురుకు తాళి క‌ట్టిన క‌విత‌.. అస‌లేం జ‌రిగిందంటే.?