భార్యపై అనుమానం.. దారుణంగా హత్య చేసిన భర్త

Published : Mar 07, 2019, 10:53 AM IST
భార్యపై అనుమానం.. దారుణంగా హత్య చేసిన భర్త

సారాంశం

భార్యపై అతను పెంచుకున్న అనుమానం.. పెనుభూతంగా మారింది. 

భార్యపై అతను పెంచుకున్న అనుమానం.. పెనుభూతంగా మారింది.  ఈ పెనుభూతం.. చివరకు భార్యను హత్యచేయడానికి కూడా దారి తీసింది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... చంద్రాయణ గుట్టకి చెందిన బౌన్సర్ కి గతేడాది ఫిబ్రవరిలో వివాహం జరిగింది. కాగా.. పెళ్లి జరిగిన కొద్దిరోజులు బాగానే ఉన్నారు. ఆ తర్వాత నుంచి భార్యను అనుమానంతో వేధించడం మొదలుపెట్టాడు. భార్య తన స్నేహితులకు ఫోన్ లో మెసేజ్ చేయడం నచ్చని.. బౌన్సర్ తరచూ ఆమెను హింసించేవాడు.

ఆమె వైఖరి మారకపోవడంతో.. బుధవారం దంపతులు ఇద్దరి మధ్యా వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన బౌన్సర్.. కత్తితో భార్యను పొడిచి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.

కాగా..  స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించారు. 

PREV
click me!

Recommended Stories

Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. కుండపోత వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ బిగ్ అలర్ట్
Konda Surekha: పదవి పోయిందని ఇంట్లో కూర్చోం.. కొండా సురేఖ కీల‌క వ్యాఖ్య‌లు