వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజ‌యం మాదే... హ్యాట్రిక్ గెలుపుపై బీఆర్ఎస్ నాయ‌కుల ధీమా

By Mahesh Rajamoni  |  First Published May 15, 2023, 12:15 PM IST

Hyderabad: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధిస్తామ‌ని అధికార పార్టీ భార‌త్ రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) నాయ‌కులు ధీమాతో ఉన్నారు. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకొని బీఆర్ఎస్ చరిత్ర సృష్టిస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి అన్నారు.
 


Telangana Assembly election: వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధిస్తామ‌ని అధికార పార్టీ భార‌త్ రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) నాయ‌కులు ధీమాతో ఉన్నారు. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకొని బీఆర్ఎస్ చరిత్ర సృష్టిస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి అన్నారు.

వివ‌రాల్లోకెళ్తే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి  (బీఆర్ఎస్) హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని ఆ పార్టీ నాయ‌కుడు, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.  బీజేపీ, కాంగ్రెస్ పార్టీల చౌకబారు రాజకీయాలకు తెలంగాణ ప్రజలు బలైపోరని ఆరోపించారు. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకొని బీఆర్ఎస్ చరిత్ర సృష్టిస్తుందని ఆయన అన్నారు.

Latest Videos

undefined

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పతనం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నుంచే మొదలైందనీ, కర్ణాటక ప్రజలు బీజేపీని ముక్త్ సౌత్ ఇండియాగా మార్చారని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన నాటి నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని విస్మరించి కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం పనిచేస్తోందని జీవన్ రెడ్డి మండిపడ్డారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితం తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేయదనీ, తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) వెంట ఉన్నారని తెలిపారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు స్థానం ఉండదని జీవ‌న్ రెడ్డి అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకుంటుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భ్రమపడ్డారనీ, జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు మెజారిటీ అసెంబ్లీ సెగ్మెంట్లలో డిపాజిట్లు కూడా దక్కవని ఆయన అన్నారు.

click me!