మే నెలాఖ‌రున TS EAMCET 2023 ఫలితాలు.. మీ రెస్పాన్స్ షీట్‌లను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..

By Mahesh Rajamoni  |  First Published May 15, 2023, 11:09 AM IST

TS EAMCET 2023 results: మే నెలాఖరులోగా టీఎస్ ఎంసెట్ 2023 ఫలితాలు విడుద‌ల కానున్నాయి. తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ విభాగాల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు చేయాలనుకునే అభ్యర్థులకు టీఎస్ ఎంసెట్ 2023 ఫలితాలు కీలకం. ఇందులో సాధించిన మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపులు ఉంటాయి.
 


TS EAMCET 2023 results: మే నెలాఖరులోగా టీఎస్ ఎంసెట్ 2023 ఫలితాలు విడుద‌ల కానున్నాయి. తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ విభాగాల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు చేయాలనుకునే అభ్యర్థులకు టీఎస్ ఎంసెట్ 2023 ఫలితాలు కీలకం. ఇందులో సాధించిన మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపులు ఉంటాయి.

వివ‌రాల్లోకెళ్తే.. తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ ఎంసెట్-TS EAMCET) హైదరాబాద్ లోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ) నిర్వహించే ప్రసిద్ధ పరీక్ష ఇది. టీఎస్ ఎంసెట్ 2023 మే 10 నుంచి 14 వరకు నిర్వహించగా, 2023 మే నెలాఖరులో ఫలితాలు వెలువడే అవకాశం ఉందని సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి.  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 3,20,683 మంది అభ్యర్థులకు వేర్వేరు కేంద్రాలు కేటాయించారు. వీరిలో 94.11 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్షను రెండు స్ట్రీమ్స్ లో నిర్వహించారు. మే 10, 11 తేదీల్లో ఏఎం స్ట్రీమ్, 12, 13, 14 తేదీల్లో ఇంజినీరింగ్ స్ట్రీమ్ నిర్వహించింది.

Latest Videos

ఇంజినీరింగ్ స్ట్రీమ్ అభ్యర్థులు తమ రెస్పాన్స్ షీట్లను అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు మే 15 నుంచి 17 వరకు ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు తెలపవచ్చు. ప్రిలిమినరీ కీపై లేవనెత్తిన అభ్యంతరాలను నిపుణులు పరిశీలించి, ఆ తర్వాత తుది కీని విడుదల చేస్తారు. ఆ త‌ర్వాత ఫ‌లితాలు వెల్ల‌డిస్తారు. బహుళ సెషన్లలో నిర్వహించే పరీక్షలను సాధారణీకరించే ప్రక్రియకు సమయం పడుతుందనీ, దీని కారణంగా మే నెలాఖరు నాటికి ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. టీఎస్ ఎంసెట్ 2023 ఫలితాలను హైదరాబాద్ లోని జేఎన్టీయూ తన అధికారిక వెబ్ సైట్ లో ప్రకటిస్తుందనీ, అభ్యర్థులు తమ హాల్టికెట్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలను చూసుకోవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు. 

తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ విభాగాల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు చేయాలనుకునే అభ్యర్థులకు టీఎస్ ఎంసెట్ 2023 ఫలితాలు కీలకం. ఫలితాలు వెలువడిన తర్వాత వివిధ కోర్సుల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. టీఎస్ ఎంసెట్ 2023 ఫలితాలను పరీక్ష అధికారిక బెబ్ సైట్ లో విడుదల చేస్తారు. కాగా, తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ ఎంసెట్) 2023 అధికారిక ఆన్సర్ కీని జేఎన్టీయూహెచ్ మే 15, 2023 రాత్రి 8 గంటలకు తన అధికారిక వెబ్ సైట్ లో విడుదల చేయనుంది. 2023 ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్ష రాసిన అభ్యర్థులు టీఎస్ ఎంసెట్-2023 ఇంజినీరింగ్ (ఈ) స్ట్రీమ్ కు సంబంధించిన రెస్పాన్స్ షీట్ ను మే 16, 2023 రాత్రి 8 గంటల వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు (ఏవైనా ఉంటే) సమర్పించడానికి చివరి తేదీ 17 మే 2023 రాత్రి 08:00 గంటల వరకు ఉంటుంది. 

ఆన్సర్ కీ టీఎస్ ఎంసెట్-2023 https://eamcet.tsche.ac.in/ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటుంది. 

TS EAMCET 2023 ఆన్సర్ కీ 2023 డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?

  1. ముందుగా jee.jntu.ac.in జేఎన్టీయూహెచ్ అధికారిక వెబ్ సైట్ కు వెళ్లండి.
  2. హోమ్ పేజీలో 'టీఎస్ ఎంసెట్ ఆన్సర్ కీ 2023' విభాగాన్ని చూడండి.
  3. అక్క‌డ ఆన్సర్ కీని డౌన్లోడ్ చేసుకోవాలనుకునే స్ట్రీమ్ లింక్ పై క్లిక్ చేయండి.
  4. తర్వాతి పేజీలో ఆన్సర్ కీని డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ పై క్లిక్ చేయండి.
  5. ఆన్సర్ కీ మీ కంప్యూటర్ లోకి డౌన్లోడ్ అవుతుంది.
click me!