దుబ్బాకలో భారీ మెజారిటీతో గెలుస్తాం: కేటీఆర్ ధీమా

By narsimha lodeFirst Published Oct 28, 2020, 5:45 PM IST
Highlights

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో విజయం సాధిస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ధీమాను వ్యక్తం చేశారు.


హైదరాబాద్: దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో విజయం సాధిస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ధీమాను వ్యక్తం చేశారు.

బుధవారం నాడు మంత్రి కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ చేశారు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విపక్షాలకు డిపాజిట్లు కూడ దక్కకపోయినా ఆశ్చర్యం లేదన్నారు.  బీజేపీ, కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో జోరు కన్పిస్తోందన్నారు. కానీ ప్రజల్లో వారి సత్తా ఏమీ లేదన్నారు.

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలను టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. నవంబర్ 3వ తేదీన ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్ధి సుజాత తరపున మంత్రి హరీష్ రావు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

also read:దుబ్బాక బైపోల్: తటస్థంగా ఉండాలని సీపీఐ నిర్ణయం, కానీ ట్విస్ట్ ఇదీ...

రైతాంగానికి నేరుగా డబ్బులు అందించిన ఘనత తెలంగాణ రాష్ట్రానిదేనని ఆయన చెప్పారు. ఆర్బీఐ విడుదల చేసిన రిపోర్టులో కూడ ఇదే విషయాన్ని స్పష్టం చేసిందన్నారు.  

తెలంగాణలో ప్రజల తలసరి ఆదాయం పెరిగిందని ఆయన చెప్పారు.రైతు బంధు లబ్దిదారులు చిన్న, సన్నకారు రైతులే అని తేలిందని చెప్పారు.తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని విమర్శలు చేస్తున్న వారంతా... రాష్ట్ర ఆదాయం పెరిగిన విషయాన్ని గుర్తించాలని ఆయన హితవు పలికారు.

 

click me!