జీహెచ్ఎంసీ మేయర్ పీఠం మాదే: అమిత్ షా

Published : Nov 29, 2020, 03:09 PM ISTUpdated : Nov 29, 2020, 03:18 PM IST
జీహెచ్ఎంసీ మేయర్ పీఠం మాదే: అమిత్ షా

సారాంశం

:జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ మేయర్ పీఠాన్ని గెలుచుకొంటామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ధీమాను వ్యక్తం చేశారు.

హైదరాబాద్:జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ మేయర్ పీఠాన్ని గెలుచుకొంటామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ధీమాను వ్యక్తం చేశారు.కేంద్ర మంత్రి అమిత్ షా ఆదివారం నాడు హైద్రాబాద్ లోని బీజేపీ  కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని గెలిపిస్తారని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. తన రోడ్‌షోలో వందలాది మంది ప్రజలు పాల్గొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రోడ్ షోలో తనకు స్వాగతం పలికిన  ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

హైద్రాబాద్ లో మౌలిక వసతులు కల్పించనప్పుడే ఐటీ హబ్ ఏర్పడుతుందన్నారు. మౌలిక వసతుల కల్పన స్థానిక సంస్థల చేతిలో ఉంటుందని ఆయన చెప్పారు.

గత ఆరేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం నగరంలోని నాలాలపై ఆక్రమణలను తొలగించలేదన్నారు. నాలాలపై ఆక్రమణలను చూసీ చూడనట్టుగా వదిలేశారని ఆయన విమర్శించారు. బీజేపీని గెలిపిస్తే నాలాలపై ఆక్రమణలను తొలగిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

సిటీలో ఆక్రమణల వల్లే గత మాసంలో వరదలు సంభవించాయన్నారు. తమకు అధికారాన్ని కట్టబెడితే వరదముంపు నుండి నగరాన్ని రక్షిస్తామని ఆయన చెప్పారు. హైద్రాబాద్ లో ఎంఐఎం అండతోనే అక్రమ కట్టడాలున్నాయని ఆయన ఆరోపించారు.

హైద్రాబాద్ లో వరదలు వచ్చినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నాడని ఆయన ప్రశ్నించారు.కేసీఆర్ ఫాంహౌస్ నుండి బయటకు రావాలని ఆయన సూచించారు. ఎంఐఎం నేతృత్వంలోనే టీఆర్ఎస్ నడుస్తోందని ఆయన చెప్పారు. 100 తాము ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టీఆర్ఎస్ విఫలమైందని ఆయన చెప్పారు.

మోడీకి జనంలో ఆదరణ వస్తోందని టీఆర్ఎస్ భయపడుతోందని అమిత్ షా చెప్పారు. హైద్రాబాద్ అభివృద్దికి కేంద్రం నిధులిస్తోందని చెప్పారు. 1.30 లక్షల ఇళ్లకు మోడీ నిధులిచ్చారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

నగరంలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తామని ఇచ్చిన హామీని టీఆర్ఎస్ ఎందకు అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు.తాను లేవనెత్తిన ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.వీధి వ్యాపారుల్లో ఎక్కువ మందికి రుణాలు లభించాయన్నారు.


 


 

PREV
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే