అమిత్ షాకి నిరసన సెగ: రోడ్‌షోలో బీఎస్ఎన్‌ఎల్ ఉద్యోగుల ప్లకార్డుల ప్రదర్శన

Published : Nov 29, 2020, 01:57 PM ISTUpdated : Nov 29, 2020, 02:25 PM IST
అమిత్ షాకి నిరసన సెగ: రోడ్‌షోలో బీఎస్ఎన్‌ఎల్ ఉద్యోగుల ప్లకార్డుల ప్రదర్శన

సారాంశం

కేంద్ర మంత్రి అమిత్ షా రోడ్ షో సందర్భంగా బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు తమకుటుంబ సభ్యులతో కలిసిన నిరసన వ్యక్తం చేశారు. సేవ్ బీఎస్ఎన్‌ఎల్ అంటూ ప్లకార్డులు చేతబూని నిరసన తెలిపారు.


హైదరాబాద్: కేంద్ర మంత్రి అమిత్ షా రోడ్ షో సందర్భంగా బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు తమకుటుంబ సభ్యులతో కలిసిన నిరసన వ్యక్తం చేశారు. సేవ్ బీఎస్ఎన్‌ఎల్ అంటూ ప్లకార్డులు చేతబూని నిరసన తెలిపారు.

also read:భాగ్యలక్ష్మి ఆలయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేక పూజలు

హైద్రాబాద్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత అమిత్ షా నేరుగా వారాసిగూడ నుండి రోడ్ షో ను ప్రారంభించారు.అమిత్ షా రోడ్ షో ను పురస్కరించుకొని వారాసీగూడలో నివాసం ఉంటున్న బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు సేవ్ బీఎస్ఎన్ఎల్ అంటూ ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు.

అమిత్ షా టూర్ లో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు నిరసన తెలపడం కలకలం రేపుతోంది.

కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరిస్తోంది. పెట్టుబడుల ఉపసంహరణను టీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని టీఆర్ఎస్ ఆరోపించింది.

ఈ విషయమై విపక్షాలతో హైద్రాబాద్ లో సమావేశాన్ని నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.


 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు