జీహెచ్ఎంసీలో వంద సీట్లకు పైగా గెలుస్తాం: టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో కేసీఆర్

By narsimha lodeFirst Published Nov 18, 2020, 4:44 PM IST
Highlights

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వంద సీట్లకు పైగా కార్పోరేట్ స్థానాలను కైవసం చేసుకొంటామని సీఎం కేసీఆర్ ధీమాను వ్యక్తం చేశారు.


హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వంద సీట్లకు పైగా కార్పోరేట్ స్థానాలను కైవసం చేసుకొంటామని సీఎం కేసీఆర్ ధీమాను వ్యక్తం చేశారు.

బుధవారం నాడు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.జీహెచ్ఎంసీ పరిధిలో ఏడేళ్లుగా చేపట్టిన అభివృద్దిని గురించి ఆయన ప్రస్తావించారు. కాంగ్రెస్, బీజేపీలు హైద్రాబాద్ గురించి ఏమాత్రం పట్టించుకోలేదన్నారు.

also read:మోడీ విధానాలకు కౌంటర్: డిసెంబర్ రెండో వారంలో కేసీఆర్ సమావేశం

గతంలో జరిగిన ఎన్నికల్లో కూడ గెలిచాం, ఓడిపోయామని ఆయన పార్టీ నేతలకు గుర్తు చేశారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సర్వ సాధారణమని ఆయన చెప్పారు.
దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమిపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పాలనపై సానుకూలంగా ఉన్నారని ఆయన చెప్పారు.

కాంగ్రెస్,బీజేపీలకు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోందని ఆయన బీజేపీపై విరుచుకుపడ్డారు.

డిసెంబర్ 1వ తేదీన జీహెచ్ఎంసీ పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 4వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు. జీహెచ్ఎంసీ పీఠాన్ని రెండోసారి కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. 
 

click me!