కార్మికులను పారిశ్రామిక వేత్తలుగా మారుస్తాం: కేటీఆర్

By Nagaraju penumalaFirst Published Aug 21, 2019, 4:09 PM IST
Highlights

రాబోయే రోజుల్లో నేతన్నలకు గౌరవం, భద్రతతో కూడిన జీవనోపాధి కల్పించనున్నట్లు తెలిపారు. సిరిసిల్లలో రూ.40.50 కోట్ల మీటర్ల క్లాత్ కు తెలంగాణ ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. 

హైదరాబాద్: సిరిసిల్ల చీరలకు బ్రాండ్ అంబాసిడర్ కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రంలో వ్యవసాయ రంగం తర్వాత చేనేత రంగం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని తెలిపారు. 

రాబోయే రోజుల్లో నేతన్నలకు గౌరవం, భద్రతతో కూడిన జీవనోపాధి కల్పించనున్నట్లు తెలిపారు. సిరిసిల్లలో రూ.40.50 కోట్ల మీటర్ల క్లాత్ కు తెలంగాణ ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. ఆ ఆర్డర్ వల్ల నెలపాటు నేతన్నలకు ఉపాధి లభించిందని స్పష్టగం చేశారు. 11 వేల మంది చేనేత కార్మికులకు రుణమాఫీ నుంచి విముక్తి కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.  

click me!