ఇక నుండి జాబ్ క్యాలెండర్: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై కేసీఆర్

Published : Mar 09, 2022, 12:40 PM ISTUpdated : Mar 09, 2022, 12:42 PM IST
ఇక నుండి జాబ్ క్యాలెండర్: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై కేసీఆర్

సారాంశం

ఇక నుండి ప్రతి ఏటా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో జాబ్ క్యాలెండర్ ను అనుసరిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ వేదికగా 80,039 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ఇవాళ ప్రకటించారు.  

హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో  నూతన విధానాన్ని అవలంభించనున్నట్టుగా తెలంగాణ సీఎం KCR ప్రకటించారు. ప్రతి ఏటా Job Calendar ను విడుదల చేస్తామని సీఎం స్పష్టం చేశారు.

బుధవారం నాడు Telangana Assembly వేదికగా  80,039 ప్రభుత్వ ఉద్యోగ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.  అయితే రానున్న రోజుల్లో కొత్త విధానాన్ని అవలంభించనున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు.

ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తామని సీఎం చెప్పారు. రాష్ట్రంలోని ఆయా ప్రభుత్వ శాఖల్లో ఎన్ని ఖాళీలున్నాయనే విషయమై ముందే ప్రకటిస్తామని చెప్పారు. ఆయా పోస్టుల భర్తీపై జాబ్ క్యాలెండర్ లో స్పష్టత ఇస్తామని కేసీఆర్ వివరించారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు నినాదమే నీళ్లు, నిధులు, నియామకాలు అనే విషయాన్ని కసీఆర్ గుర్తు చేశారు.  ఆంధ్రప్రదేశ రాష్ట్రం ఇబ్బందులు పెట్టడం వల్లే ఉద్యోగాల భర్తీ విషయమై ఆలస్యమైందన్నారు. ఇంకా కూడా 9,10 షెడ్యూల్ సంస్థల్లో ఉద్యోగుల విభజన ఇంకా పూర్తి కాని విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు.

గతంలో మాదిరిగా government Jobs భర్తీ భవిష్యత్తులో ఉండదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో పారదర్శకతతో వ్యవహరిస్తామన్నారు. అందుకే జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు 91,147 ఉన్నాయని సీఎం చెప్పారు. అయితే ఇందులో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించగా మిగిలిన 80,039 ఉద్యోగ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

పోలీస్ శాఖలో 18,334, విద్యాశాఖలో 13,086, వైద్య, ఆరోగ్యశాఖలో 12,755, ఉన్నత విద్యా శాఖలో 7,878, రెవిన్యూ శాఖలో 3,560, బీసీ సంక్షేమ శాఖలో 4,311, గిరిజన సంక్షేమ శాఖలో 2,399, సాగునీటి శాఖలో 2,692  పోస్టులను భర్తీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఇవాళ్టి నుండే ఉద్యోగ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్  జారీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. 

మైనారిటీ శాఖలో 1,825,అటవీశాఖలో 1598,పంచాయితీరాజ్ శాఖలో 1455,కార్మిక శాఖలో 1221,ఫైనాన్స్ శాఖలో 1146, మున్సిఫల్ శాఖలో 859, వ్యవసాయ శాఖలో 801, రవాణ శాఖలో 563 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సీఎం చెప్పారు.న్యాయ శాఖలో 386,సాధారణ పరిపాలన శాఖలో 343,పరిశ్రమల శాఖలో 233, పర్యాటక శాఖలో 184, సచివాలయం, హెచ్ఓడీ, వర్శిటీల్లో 8,147 ఖాళీలున్నాయని సీఎం వివరించారు.

ఇక గ్రూప్- 1లో 503,గ్రూపు 2లో 582, గ్రూప్ 3లో1373, గ్రూప్ 4 లో9168, జిల్లా స్ధాయి లో 39,829,జోనల్ స్థాయిలో 18866,మల్టీజోన్ లో13170, అదర్ కేటగిరిలో వర్సిటీలలో 8174 భర్తీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. 

ఇక జిల్లాల వారీగా ఈ కింది విధంగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టుగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. 
హైదరాబాద్ – 5,268
నిజామాబాద్- 1,976
మేడ్చల్ మల్కాజ్‌గిరి- 1,769
రంగారెడ్డి- 1,561
కరీంనగర్- 1,465
నల్లగొండ- 1,398
కామారెడ్డి- 1,340
ఖమ్మం- 1,340
భద్రాద్రి కొత్తగూడెం- 1,316
నాగర్‌కర్నూల్- 1,257
సంగారెడ్డి- 1,243
మహబూబ్‌నగర్- 1,213
ఆదిలాబాద్- 1,193
సిద్దిపేట- 1,178
మహబూబాబాద్- 1,172
హనుమకొండ- 1,157
మెదక్- 1,149
జగిత్యాల- 1,063
మంచిర్యాల- 1,025
యాదాద్రి భువనగిరి- 1,010
జయశంకర్ భూపాలపల్లి- 918
నిర్మల్- 876
వరంగల్- 842
కుమ్రం భీం ఆసీఫాబాద్- 825
పెద్దపల్లి- 800
జనగాం- 760
నారాయణపేట్- 741
వికారాబాద్- 738
సూర్యాపేట- 719
ములుగు- 696
జోగులాంబ గద్వాల- 662
రాజన్న సిరిసిల్లా- 601
వనపర్తి- 556
 

పోలీస్ శాఖ మినహాయించి అన్ని ఉద్యోగాలకు అభ్యర్ధుల వయో పరిమితిని పదేళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకొన్నామని కేసీఆర్ తెలిపారు. ఓసీలకు 44 ఏళ్లు ,ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్లకు వయో పరిమితి పెంచుతున్నట్టుగా కేసీఆర్ తెలిపారు.


 

PREV
click me!

Recommended Stories

Hyderabad Cold Wave Alert | వాతావరణ పరిస్థితులపై IMD ధర్మరాజు కీలక సమాచారం | Asianet News Telugu
IMD Rain Alert : ఇక మంచు తుపాను బీభత్సం... ఆ ప్రాంతాల్లో అల్లకల్లోలమే..!