కరోనా వ్యాక్సిన్: హైద్రాబాద్ నిమ్స్ లో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం

By narsimha lode  |  First Published Jul 20, 2020, 4:22 PM IST

కరోనా వ్యాక్సిన్ తయారీలో భాగంగా క్లినికల్ ట్రయల్స్ హైద్రాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో సోమవారం నాడు ప్రారంభమయ్యాయి. ఇద్దరు వాలంటీర్లకు వ్యాక్సిన్ తొలి డోసు ఇచ్చారు. 



హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ తయారీలో భాగంగా క్లినికల్ ట్రయల్స్ హైద్రాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో సోమవారం నాడు ప్రారంభమయ్యాయి. ఇద్దరు వాలంటీర్లకు వ్యాక్సిన్ తొలి డోసు ఇచ్చారు. 

భారత్ బయోటెక్ కంపెనీ పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ)తో కలిసి పనిచేస్తోంది. ఈ వ్యాక్సిన్ ను ఎంపిక చేసిన వాలంటీర్లపై ప్రయోగిస్తున్నారు. దేశంలోని 12 వైద్య కేంద్రాల్లో వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి.

Latest Videos

తెలంగాణ రాష్ట్రంలో నిమ్స్ ను క్లినికల్ ట్రయల్స్ కోసం ఐసీఎంఆర్ ఎంపిక చేసింది. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు గాను ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థలు వ్యాక్సిన్ తయారీలో తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత్ బయోటెక్ సంస్థ కూడ వ్యాక్సిన్ తయారీలో కీలక దశకు చేరుకొంది.

also read:నిమ్స్‌లో మనుషులపై కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్: ఈ నెల 7 నుండి ప్రారంభం

క్లినికల్ ట్రయల్స్ లో వచ్చిన ఫలితాల ఆధారంగా వ్యాక్సిన్ పై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ఏడాది ఆగష్టు 15వ తేదీ నాటికి వ్యాక్సిన్ ను దేశంలో అందుబాటులోకి తీసుకురావాలని ఐసీఎంఆర్ ప్లాన్ చేస్తోంది. 

ప్రపంచంలోని పలు సంస్థలు కూడ కరోనా వ్యాక్సిన్ తయారీలో తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని సంస్థల ప్రయోగాలు క్లినికల్ ట్రయల్స్ లో తుది దశకు చేరుకొన్నాయి.
 

click me!