జింఖానా గ్రౌండ్స్ లో తొక్కిసలాటకు బాధ్యులపై చర్యలు: మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్

By narsimha lode  |  First Published Sep 22, 2022, 3:37 PM IST

జింఖానా గ్రౌండ్స్ లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై  కేసు నమోదు చేస్తామని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. ఇండియా, అస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ కు సంబంధించి టికెట్ల విక్రయం హెచ్ సీ దేనని ఆయన చెప్పారు.


హైదరాబాద్:   జింఖానా గ్రౌండ్ర్స్ లో తొక్కిసలాట ఘటనకు  బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొంటామని తెలంగాణ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.గురువారం నాడు హైద్రాబాద్ లో మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.జింఖానా గ్రౌండ్స్ వద్ద  తొక్కిసలాట ఘటనపై  కేసులు నమోదు చేస్తామన్నారు. భారత్, అస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్  కు సంబంధించిన టికెట్ల విక్రయం హెచ్ సీ ఏదే బాధ్యత అని మంత్రి  చెప్పారు. ఈ విషయమై తమను అడిగితే ఏర్పాట్లకు సహకరించే వాళ్లమన్నారు.  తెలంగాణ ప్రతిస్టను ఎవరూ దెబ్బతీసిన మేం ఊరుకోమని ఆయన చెప్పారు.టికెట్ల విక్రయాల్లో అవకతవకలు జరిగితే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకొంటామని మంత్రి ప్రకటించారు.  టికెట్ల విక్రయంలో  హెచ్ సీ ఏ పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. కరోనా తర్వాత మ్యాచ్ జరుగుతున్నందున టికెట్లకు డిమాండ్ బాగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ నెల 25న ఉప్పల్ స్టేడియంలో  ఇండియా, అస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్  ఉంది. ఈ మ్యాచ్ టికెట్ల విషయమై క్రికెట్ అభిమానులు వారం రోజులుగా హెచ్ సీ ఏ, జింఖానా గ్రౌండ్ చుట్టూ తిరుగుతున్నారు. టికెట్ల విక్రయంలో గోల్ మాల్ చోటు చేసుకుందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆఫ్ లైన్ లో టికెట్ల విక్రయం కోసం క్రికెట్ అభిమానులు ఆందోళనలు చేశారు. దీంతో ఇవాళ జింఖానా గ్రౌండ్స్ లో టికెట్ల విక్రయం చేస్తామని హెచ్ సీ ఏ ప్రకటించింది.  అయితే టికెట్ల విక్రయానికిసంబంధించి ఏర్పాట్లు చేయలేదు. పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు జింఖానా గ్రౌండ్ వద్దకు తరలి వచ్చారు.  టికెట్ కౌంటర్ ప్రారంభించిన గంటన్నర తర్వాత కూడా ఒక్క టికెట్ కూడ విక్రయించలేదు.  అదే సమయంలో  వర్షం రావడంతో గేటు వైపునకు పెద్ద ఎత్తున క్యూ లైన్లలో ఉన్నవారు వచ్చారు. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జీ చేశారు. ఈ సమయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో గాయపడిన యువతి పరిస్థితి విషమంగా ఉంది.

Latest Videos

undefined

also read:జింఖానా గ్రౌండ్స్ తొక్కిసలాటపై హెచ్ సీ ఏకి నోటీసిలిస్తాం: హైద్రాబాద్ అడిషనల్ సీపీ చౌహన్

జింఖానా గ్రౌండ్  వద్ద తొక్కిసలాటపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. టికెట్ల విక్రయానికి సంబంధించి సమాచారంతో రావాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్ సీ ఏ అధ్యక్షుడు అజహరుద్దీన్ సహ అధికారులను ఆదేశించారు. ఆన్ లైన్ లో ఎన్ని టికెట్లు విక్రయించారు. ఆఫ్ లైన్ లో ఎన్ని టికెట్లు విక్రయించారనే విషయమై సమాచారాన్ని ప్రభుత్వం  హె,చ్ సీ ఏను ఆరా తీయనుంది. 

click me!