
హైదరాబాద్: తెలంగాణ ఇవ్వొద్దని తాము ఎప్పుడూ చెప్పలేదని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెప్పారు.హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ లో ఆమె శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకి కాదన్నారు.. తెలంగాణకు వైఎస్ మంచి చేశారా? ద్రోహం చేశారా అనేది గ్రామాలకు వెళ్లి ప్రజలను అడగాలని ఆమె కోరారు. ఇది నా గడ్డ.. తెలంగాణ కోసం పోరాటం చేయడానికి వచ్చినట్టుగా ఆమె చెప్పారు. విబేధించి పెట్టిన పార్టీ కాదన్నారు. ప్రజలపై ప్రేమతో పెట్టిన పార్టీగా ఆమె తెలిపారు.తన కోసం పార్టీ పెట్టలేదన్నారు. తెలంగాణలో పార్టీ అవసరం ఉన్నందునే పార్టీ ఏర్పాటు చేసినట్టుగా ఆమె చెప్పారు.
తానున్నా లేకున్నా ఇక్కడ పార్టీ కొనసాగాలనేది తన అభిమతమన్నారు.తెలంగాణ ప్రజల గురించి తాము మొదటి నుండి పోరాటం చేస్తున్నామన్నారు. తెలంగాణలో పార్టీ అవసరమని భావించి పార్టీ ఏర్పాటు చేసినట్టుగా ఆమె చెప్పారు. తాము తెలంగాణకు వ్యతిరేకమనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.