వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు వేర్వేరు రంగుల్లో పాస్ పుస్తకాలు: కేసీఆర్

Published : Sep 11, 2020, 06:00 PM IST
వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు వేర్వేరు రంగుల్లో పాస్ పుస్తకాలు: కేసీఆర్

సారాంశం

వ్యవసాయేతర భూములకు మెరూన్ కలర్ తో పాస్ పుస్తకాలు అందిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు.

హైదరాబాద్: వ్యవసాయేతర భూములకు మెరూన్ కలర్ తో పాస్ పుస్తకాలు అందిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు.

శుక్రవారం నాడు కొత్త రెవిన్యూ ముసాయిదా బిల్లుపై ఎమ్మెల్యేలు సందేహాలకు సీఎం కేసీఆర్ సమాధానం చెప్పారు.

వ్యవసాయ భూములకు గ్రీన్ కలర్ లో పాస్ పుస్తకాలను అందిస్తామన్నారు. కొత్త చట్టంలో తప్పులు చేసిన రెవిన్యూ అధికారులపై కఠిన చర్య లు తీసుకొంటామన్నారు. సర్వీసు నుండి తొలగిస్తామని ఆయన ప్రకటించారు. 

also read:పేదలకు కేసీఆర్ గుడ్ న్యూస్: 58,59 జీవోలను పొడిగిస్తాం

వీఆర్ఏ విధులు నిర్వహిస్తూ అదే కుటుంబంలో అర్హులైనవారుంటే వారిని వీఆర్ఏలుగా తీసుకొనేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన ప్రకటించారు.  రెవిన్యూ వ్యవస్థలో ప్రస్తుతం ఉన్న వారంతా యధావిధిగా కొనసాగుతారని ఆయన చెప్పారు. వీఆర్ఓలతోనే ఇబ్బందులు ఉన్నందున వారిని రెవిన్యూ నుండి తొలగించామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

రెవిన్యూ డిపార్ట్ మెంట్ ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో  చాలా కీలకంగా వ్యవహరిస్తారని ఆయన గుర్తు చేశారు. రెవిన్యూ శాఖ చేసే పనులు ఇతరులు చేయలేరని సీఎం తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert: మ‌రో 2 రోజులు చుక్క‌లే.. దారుణంగా ప‌డిపోనున్న ఉష్ణోగ్ర‌త‌లు
హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?